భర్తపై ఎమోషనల్ కామెంట్స్ చేసిన అనసూయ.. దానికి కారణం అతనేనంటూ..?

బుల్లితెరపై ప్రతి గురువారం రాత్రి 9.30 గంటల సమయంలో ప్రసారమయ్యే జబర్దస్త్ షో ద్వారా యాంకర్ అనసూయ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న సంగతి తెలిసిందే.పెళ్లై పిల్లలున్నా గ్లామరస్ గానే కనిపించే అనసూయ తన భర్తపై ఉన్న ప్రేమను చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు.అనసూయకు ఈ స్థాయికి ఎదగడంలో భర్త ప్రోత్సాహం కూడా ఎంతో ఉందనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

 Anchor Anasuya Emotional Comments About Her Husband, About Anasuya, Husband, Em-TeluguStop.com

భర్త పేరును అనసూయ తన ఎదపై పచ్చబొట్టులా పొడిపించుకోవడం గమనార్హం.తాజాగా అనసూయ భర్తతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పాటు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తన భర్త వల్లే తాను ఇంత సంతోషంగా నవ్వుతూ జీవిస్తూ ఉన్నానని భర్త ప్రసాదించిన నవ్వే ఇది అంటూ ఆ పోస్ట్ లో ఎమోషనల్ కామెంట్స్ చేశారు.తన అందమైన నవ్వుకు భర్తే కారణమని అనసూయ చెప్పకనే చెప్పేశారు.

సోషల్ మీడియాలో అనసూయ షేర్ చేసిన ఫోటో వైరల్ అవుతుండగా కొందరు నెటిజన్లు పాజిటివ్ గా కామెంట్లు చేస్తుంటే మరి కొందరు నెటిజన్లు మాత్రం సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు.అయితే తనపై వచ్చే ట్రోల్స్ ను అనసూయ మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు.మరోవైపు సినిమాల్లో అనసూయ తన హవాను కొనసాగిస్తూ ఉండటం గమనార్హం.ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్లో అనసూయ వరుసగా నటిస్తున్నారు.

పుష్ప సినిమాతో పాటు అనసూయ రంగమార్తాండ సినిమాలో కూడా నటిస్తుండగా అనసూయ చేతిలో మరికొన్ని సినిమా ఆఫర్లు ఉన్నాయి.ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు హిట్టైతే అనసూయకు ఆఫర్లు మరింత పెరుగుతాయని చెప్పడంలో సందేహం అవసరం లేదు.అనసూయ బుల్లితెర, వెండితెర రెండింటికీ సమ ప్రాధాన్యత ఇస్తూ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube