ఇప్పటివరకు అల్లు అర్జున్ తో ఆ పని చెయ్యలేదు.. ఈసారి షూటింగ్ లో చేస్తా: అనసూయ

టాలీవుడ్ ఇండస్ట్రీలో బుల్లితెర పైనే కాకుండా వెండితెరపై కూడా మంచి ఫామ్ సంపాదించుకున్న బ్యూటీ యాంకర్ అనసూయ. కెరీర్ మొదట్లో వెండితెరకు సైడ్ ఆర్టిస్ట్ గా పరిచయమైన అనసూయ ఆ తర్వాత ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షోలో యాంకర్ గా అడుగు పెట్టింది.

 Actress Anasuya Comments On Selfie With Allu Arjun In Pushpa Shooting Details, Anchor Anasuya, Tollywood, Comment, Allu Arjun, Film Industry, Pushpa Movie, Selfie With Allu Arjun, Anasuya Comments, Dakshayini Character, Anasuya Pushpa Movie, Rashmika Mandanna, Tollywood-TeluguStop.com

ఇక ఈ షోతోనే అనసూయ కెరీర్ మలుపు తిరిగింది.

ఇందులో తన యాంకరింగ్ తో ఎంతో మందిని ఆకట్టుకుంది.

 Actress Anasuya Comments On Selfie With Allu Arjun In Pushpa Shooting Details, Anchor Anasuya, Tollywood, Comment, Allu Arjun, Film Industry, Pushpa Movie, Selfie With Allu Arjun, Anasuya Comments, Dakshayini Character, Anasuya Pushpa Movie, Rashmika Mandanna, Tollywood-ఇప్పటివరకు అల్లు అర్జున్ తో ఆ పని చెయ్యలేదు.. ఈసారి షూటింగ్ లో చేస్తా: అనసూయ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక తన అందాలతో మాత్రం కుర్రాళ్ల గుండెల్లో గుడి కట్టేసుకుంది.లేటు వయసులో కూడా అనసూయ తన అందాలను బాగా ఆరబోస్తుంది.

అలా మళ్లీ వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చింది.అందులో రంగస్థలం సినిమాలో రంగమ్మ పాత్రతో ఎనలేని క్రేజ్ సంపాదించుకుంది.

ఆ తర్వాత పలు సినిమాలలో స్పెషల్ సాంగ్ లో కూడా నటించింది.ఓవైపు నటిగా, మరోవైపు యాంకర్ గా సమాన బాధ్యతలు చేపడుతుంది అనసూయ.ఇప్పటికి జబర్దస్త్ లో యాంకర్ గా కొనసాగుతూనే ఉంది.ఇక ఇటీవలే పుష్ప సినిమాలో నెగటివ్ పాత్రలో నటించి మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

పైగా తన లుక్ తో అందర్నీ ఫిదా చేసింది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా మూవీ పుష్ప లో దాక్షాయిని పాత్రలో చిత్తూరు భాషతో నటించి మంచి పేరు సంపాదించుకుంది.ఇక అనసూయకు పెళ్లయి ఇద్దరు కొడుకులు కూడా ఉన్న సంగతి తెలిసిందే.ఇక తన ఫ్యామిలీని అభిమానులకు ఎప్పుడో పరిచయం చేసింది అనసూయ.

ఇద్దరు కొడుకులు ఉన్న కూడా అనసూయ లో గ్లామర్ మాత్రం తగ్గలేదనే చెప్పాలి.

సోషల్ మీడియాలో మాత్రం అనసూయ బాగా యాక్టివ్ గా ఉంటుంది.ఎంత బిజీగా ఉన్న ప్రతి రోజు ఏదో ఒక పోస్టు తో తన ఫాలోవర్స్ ను పలకరిస్తుంది.బాగా ఫోటో షూట్ లు చేయించుకుంటూ ఫోటోలను తెగ షేర్ చేసుకుంటుంది.

అంతేకాకుండా డాన్సులు చేస్తూ ఆ వీడియోలను కూడా బాగా షేర్ చేసుకుంటుంది.ఎంత నటి అయినా సరే ఒక ఇల్లాలిగా కూడా బాధ్యతలు చూసుకుంటుంది.

తన ఫ్యామిలీతో బాగా గడుపుతుంది.వారితో గడిపిన క్షణాలను కూడా అందరికీ షేర్ చేస్తుంది.అనసూయ ఎంత సరదాగా ఉంటుందో అదే రేంజ్ లో ఫైర్ అవుతూ ఉంటుంది కూడా.తనకు నెగిటివ్ కామెంట్లు వస్తే చాలు వెంటనే వారిపై ఫైర్ అవుతుంది.

తనదైన స్టైల్లో రివర్స్ కౌంటర్ ఇస్తుంది.అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు కూడా పెడుతూ ఉంటుంది.

ఇక తాజాగా తన ఇన్ స్టా లో తన ఫాలోవర్స్ తో కాసేపు ముచ్చట్లు పెట్టింది.అందులో ఓ నెటిజెన్ పుష్ప షూటింగ్ లో అల్లు అర్జున్ తో దిగిన సెల్ఫీ ని షేర్ చేయమని అనటంతో.

ఫోటో దిగలేదని.ఇప్పటివరకు అల్లు అర్జున్ తో సెల్ఫీనే దిగలేదని.

కావాలంటే ఈసారి షూటింగ్ లో తప్పకుండా సెల్ఫీ దిగుతానని తెలిపింది.

Actress Anasuya Shocking Comments On Selfie with Allu Arjun

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube