చిన్నప్పటి ఫోటోలో కనిపిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా....?

తెలుగులో ప్రముఖ దర్శకుడు ఎమ్.శరవణన్ దర్శకత్వం వహించిన  “జర్నీ” అనే చిత్రంలో టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ సరసన నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నమళయాళీ ముద్దుగుమ్మ అనన్య గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

 Ananya, Telugu Actress, Fathers Day, Journey, Telugu Movie-TeluguStop.com

అయితే ఈ అమ్మడు జర్నీ చిత్రం కంటే ముందుగా తెలుగులో పలు  డబ్బింగ్ చిత్రాలలో నటించినప్పటికీ ఆ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేక పోవడంతో ఈ అమ్మడికి గుర్తింపు రాలేదు.కాగా తాజాగా అనన్య ఫాదర్స్ డే సందర్భంగా తన అధికారిక సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా స్పందిస్తూ తన తండ్రికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపింది.

ఇందులో భాగంగా తన తండ్రితో కలిసి దిగినటువంటి ఫోటో ని కూడా అనన్య షేర్ చేసింది.దీంతో కొందరు నెటిజన్లు అనన్య చిన్నప్పటి ఫోటోని సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ ట్రోల్స్ చేస్తున్నారు.

అంతేకాక ఎప్పుడు తన అభిమానులతో ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి మాధ్యమాల ద్వారా అభిమానులతో అందుబాటులో ఉన్నటువంటి అనన్య చిన్నప్పటి ఫోటో ని చూసి కొంతమంది అభిమానులు అనన్య చిన్నప్పుడు చాలా క్యూట్ గా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.అయితే ఎప్పుడు ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలతో అలరించేటువంటి అనన్య తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది.

అయితే పెళ్లి చేసుకున్న అనంతరం అనన్య కొంతమేర సినిమాల పరంగా జోరు తగ్గించినట్లు తెలుస్తోంది.అలాగే తాను నటించే చిత్రాల కథల విషయంలో కూడా కొంతమేర దృష్టి సారించినట్లు సమాచారం.కాగా  ఆ మధ్య కాలంలో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటించినటువంటి మహర్షి అనే చిత్రంలో అల్లరి నరేష్ కి జోడీగా నటించింది.ఈ చిత్రం బాగా హిట్ అయిన ప్పటికీ అనన్య నటించిన పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో ఆమెకు గుర్తింపు రాలేదు.

దీంతో ప్రస్తుతం ఈ అమ్మడికి తెలుగులో పెద్దగా అవకాశాలు లేనట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube