చికాగో సెక్స్ రాకెట్ పై ఆరుగురు పతివ్రతలు అమృత సంచలన వ్యాఖ్యలు.! అర్థ‌రాత్రి 12 గంట‌ల స‌మ‌యంలో.. !       2018-06-19   23:20:59  IST  Raghu V

తెలుగు చిత్రసీమలో కాస్టింగ్‌ కౌచ్‌ వివాదం ఇంకా సద్దుమణగముందే.. చికాగో సెక్స్ రాకెట్ ప్రకంపనలు రేపుతోంది. అమెరికాలో తెలుగు దంపతులు మోదుగుమూడి కిషన్, చంద్రకళ నడిపిస్తున్న వ్యభిచారం ఉదంతం వెలుగులోకి రావడంతో చిత్రసీమ మరోసారి కలవరపాటుకి గురైంది. సెక్స్‌ రాకెట్‌ గుట్టు రట్టయినప్పటి నుంచి అమెరికా పోలీసులు సినిమా తారలు, సినిమాలతో సంబంధం ఉన్నవారిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అక్కడ స్థిరపడిన వారు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినా.. ప్రత్యేక నిఘా పెడుతున్నారు. గతంలో జరిగిన కార్యక్రమాలు, అందులో పాల్గొన్న నటీమణుల గురించి కూడా ఆరా తీస్తున్నారు. దీంతో ఆ చీకటి బాగోతంతో సంబంధం ఉన్న తారలతో పాటు ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లొచ్చిన వారు కూడా హడలిపోతున్నారు.

ఈ విష‌యంపై క‌న్న‌డ సినీ న‌టి అమృత స్పందించారు. అయితే, ఇటీవ‌ల ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. గ‌త సంవ‌త్స‌రం డిసెంబ‌ర్ లో అర్థ‌రాత్రి 12 గంట‌ల స‌మ‌యంలో మోదుగుల కిష‌న్‌, చంద్ర‌క‌ళ నుంచి త‌న‌కు ఫోన్ చేశార‌ని, డిసెంబ‌ర్ 31 వేడుక‌ల‌కు త‌మ వ‌ద్ద మంచి ఆఫ‌ర్ ఉంద‌ని త‌న‌కు చెప్పార‌ని తెలిపింది. ఇంకోసారి ఇటువంటి ఫోన్స్ చేస్తే పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తాన‌ని వారిని హెచ్చ‌రించాను. అయినా వారు నాతో చాలా సార్లు అస‌భ్యంగా మాట్లాడారు. దీంతో వారి నెంబ‌ర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టాన‌ని ఇంట‌ర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చింది న‌టి అమృత‌.