సీఎం కేసీఆర్ నా ప్రాణదాత.. అల్లరి సుభాషిణి కీలక వ్యాఖ్యలు..?

అల్లరి సినిమాతో లేడీ కమెడియన్ గా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న సుభాషిణి తర్వాత రోజుల్లో కూడా చాలా సినిమాల్లో లేడీ కమెడియన్ గా చేసి మంచి పేరును సంపాదించుకున్నారు.కొన్ని రోజుల క్రితం ఒక షోలో తనకు క్యాన్సర్ వచ్చిందని క్యాన్సర్ నుంచి కోలుకున్నానని సుభాషిణి కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.

 Allari Subhashini Comments About Cm Kcr Greatness,  15 Lakh Rupees, Allari Subha-TeluguStop.com

ఆ షోలో సుభాషిణి సీఎం కేసీఆర్ గురించి మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించారు.

సీఎం కేసీఆర్ తనకు ప్రాణదాత అని ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ మధ్య కాలంలో సినిమాల్లో ఎక్కువగా నటించని సుభాషిణి తనకు అనారోగ్య సమస్యలు రావడంతో వైద్యుడిని సంప్రదించగా క్యాన్సర్ వచ్చిందని చెప్పారని ఆమె అన్నారు.క్యాన్సర్ చికిత్స కోసం 15 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పారని సుభాషిణి పేర్కొన్నారు.

ఆ సమయంలో తాను ప్రగతి భవన్ కు వెళ్లి చికిత్స కోసం సహాయం కోరానని సుభాషిణి వెల్లడించారు.

Telugu Rupees, Cancer, Chiranjeevi, Kcr Greatness, Brothers, Nagababu-Movie

తనకు ఆరోగ్యశ్రీ స్కీమ్ ద్వారా డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండానే క్యాన్సర్ కు సంబంధించిన ఆపరేషన్ పూర్తైందని అల్లరి సుభాషిణి చెప్పుకొచ్చారు.సీఎం కేసీఆర్ కు లైఫ్ టైమ్ తాను రుణపడి ఉంటానని కేవలం మూడు రోజుల్లో ఆపరేషన్ పూర్తైందని సుభాషిణి వెల్లడించారు.మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తనకు లక్ష రూపాయలు సహాయం చేసిందని సుభాషిణి పేర్కొన్నారు.

Telugu Rupees, Cancer, Chiranjeevi, Kcr Greatness, Brothers, Nagababu-Movie

మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు తనకు ఆర్థిక సహాయం అందించారని సుభాషిణి పేర్కొన్నారు.తనకు సినిమా ఆఫర్లు వస్తున్నాయని త్వరలోనే సినిమాలలో తిరిగి నటిస్తానని ఆమె చెప్పుకొచ్చారు.లైఫ్ లాంగ్ సీఎం కేసీఆర్ కు తాను రుణపడి ఉంటానని సుభాషిణి తెలిపారు.అల్లరి సుభాషిణి వరుస ఆఫర్లతో బిజీ కావాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube