వేశ్య పాత్రని చెప్పకుండా మోసగించారు.. నటి కీలక వ్యాఖ్యలు..?

సాధారణంగా ఇండస్ట్రీలో అడపాదడపా అవకాశాలు వస్తున్న నటులు స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ వస్తే ఎగిరి గంతేస్తారనే సంగతి తెలిసిందే.అయితే కొన్నిసార్లు స్టార్ హీరోల సినిమాల్లోని పాత్రలు కెరీర్ కు ప్లస్ అయితే మరి కొన్నిసార్లు మాత్రం మైనస్ అవుతుంటాయి.

 Actress Akshara Gowda Comments About Tupaki Movie Role-TeluguStop.com

స్టార్ హీరోల సినిమాల్లోని పాత్రలను బట్టి ఆయా హీరోల కెరీర్ ఆధారపడి ఉంటుంది.టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లో కీలక పాత్రల్లో నటిస్తూ అక్షర గౌడ గుర్తింపును సొంతం చేసుకున్నారు.

అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రలతో పాటు గ్లామరస్ రోల్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న అక్షర గౌడ ప్రస్తుతం శూర్పణఖ అనే సినిమాలో నటిస్తుండగా ఆ సినిమా త్వరలో రిలీజ్ కానుంది.మరోవైపు సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అక్షర గౌడ వార్తల్లో నిలిచారు.

 Actress Akshara Gowda Comments About Tupaki Movie Role-వేశ్య పాత్రని చెప్పకుండా మోసగించారు.. నటి కీలక వ్యాఖ్యలు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే మురుగదాస్ విజయ్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలో అక్షర గౌడ వేశ్య పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

ఆ సినిమాలో వేశ్య రోల్ లో నటించడం గురించి మాట్లాడుతూ అక్షర గౌడ కీలక వ్యాఖ్యలు చేశారు.

Telugu Askhara Gowda, Hero Vijay, Hot Photo Goes Viral, Muragadass, Prostitute Role, Regina, Shocking Comments, Shoorpanakha Movie, Tupaki Movie, Vijay Setupati-Movie

ఆ సినిమాలో కేవలం ఒకే ఒక సన్నివేశంలో అక్షర గౌడ కనిపించడం గమనార్హం.ఈ సినిమా కథ చెప్పిన సమయంలో తనకు వేశ్య పాత్ర అని స్పష్టంగా చెప్పలేదని అక్షర గౌడ పేర్కొన్నారు.అయితే షూటింగ్ కు వెళ్లిన సమయంలో ఆ పాత్రలో నటించాల్సి వచ్చిందని అక్షర గౌడ వెల్లడించారు.

శూర్పణఖ సినిమాతో అక్షర గౌడ తెలుగుతో గుర్తింపును సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంటుంది.

ఈ సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తుండగా రెజీనా హీరోయిన్ రోల్ లో నటిస్తున్నారు.తెలుగులో మన్మథుడు2 సినిమాలో చిన్న పాత్రలో అక్షర గౌడ నటించారు.ఆ సినిమా ఫ్లాప్ కావడం వల్ల తెలుగులో అక్షరకు పెద్దగా గుర్తింపు రాలేదు.

#Prostitute Role #Regina #Muragadass #HotPhoto #Askhara Gowda

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు