ఐశ్వర్య రాయ్..
ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ప్రపంచ సుందరిగా ఎదిగిన ఈమె స్కూల్ డేస్ లోనే ఓ పెన్సిల్ కంపెనీ యాడ్ లో యాక్ట్ చేసింది.1991లో నిర్వహించిన పోటీల్లో ఈ నీలికళ్ల సుందరి సూపర్ మోడల్ గా విజేతగా నిలిచింది.దాంతో దశతిరిగింది.
రెండేళ్ల పాటు వరుసగా మోడల్ గా అవకాశాలు క్యూ కట్టాయ్.అదే సమయంలో చక్కటి అందం, నీలికళ్లతో సినిమా హీరోయిన్ అవ్వాలని ప్రముఖ హీరోయిన్ రేఖ సపోర్ట్ చేసింది.1993లో ఆమిర్‌ఖాన్‌తో యాడ్, 1994లో మిస్ ఇండియా పోటీల్లో రన్నరప్‌గా, 1995 ప్రపంచ సుందరి పోటీల్లో టైటిల్ గెలుచుకుంది.
అలా ప్రపంచ సుందరిగా మొదలైన ఐశ్వర్యారాయ్ ప్రస్థానం తమిళంలో తన తొలి సినిమా 1997 లో డైరక్టర్ మణిరత్నం దర్శకత్వం వహించిన ఇరువర్ సినిమాలో యాక్ట్ చేసింది.
ఆ సినిమా పెద్దగా ఆడకపోయినా అదే ఏడాది ఔర్‌ప్యార్ హో గయా చిత్రంతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.కానీ 1998లో శంకర్ తీసిన జీన్స్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.
హమ్ దిల్ దే చుకే సనమ్, తాల్, హమ్ కిసీ సే కమ్ నహీ, దేవదాస్ తో మెప్పిచ్చింది.అయితే స్టోరీ పరంగా ఐశ్వర్యరాయ్ కొన్ని సినిమాల్ని తృణప్రాయంగా వదిలేసుకుంది.

1996లో అమీర్ ఖాన్ హీరోగా విడుదలైన సూపర్ హిట్ మూవీ రాజా హిందుస్తానీ, యశ్ చోప్రా ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్ దిల్ తో పాగల్ హై, కరణ్ జోహార్ తెరకెక్కించిన కుచ్ కుచ్ హోతా హై, షారుక్ ఖాన్, ప్రీతి జింటా యాక్ట్ చేసిన సెన్సేషనల్ వీర్ జారాలో,షారుక్ ఖాన్, దీపిక జంటగా ఫరా ఖాన్ తెరకెక్కించిన హ్యాపీ న్యూ ఇయర్ తో పాటు హాలీవుడ్ లో బ్రాడ్ పిట్ సరసన ట్రాయ్ సినిమాలో ఐశ్వర్యరాయ్ నటించాల్సి ఉంది.కానీ ఆ సినిమాలో ముద్దుసీన్లు ఎక్కువగా ఉండడంతో ఆ సినిమాకు నో చెప్పింది ఐశ్వర్యరాయ్.