మా నాన్న అటువంటి వ్యక్తి కాదు.. ఆమెవి తప్పుడు ఆరోపణలు   Actress Aishwarya Arjun About Her Father's Eleigations With Sruthi     2018-10-23   10:48:38  IST  Ramesh P

మీటూ ఉద్యమంలో భాగంగా కన్నడ స్టార్‌ హీరో అర్జున్‌ పై హీరోయిన్‌ శృతి హారిహరన్‌ సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా వీరిద్దరి కాంబినేషన్‌లో ‘విస్మయ’(తెలుగులో కురుక్షేత్రం) చిత్రంలో నటించారు. విస్మయ షూటింగ్‌ సమయంలో దర్శకుడు చెప్పకుండానే రొమాంటిక్‌ సీన్స్‌లో అర్జున్‌ అతి చేశారని, దగ్గరకు లాక్కుని, వీపున చేయి వేసి నిమిరాడు అంటూ అర్జున్‌పై శృతి ఆరోపణలు చేసింది. ఆయన పలు సార్లు అలాగే చేయడంతో నాకు చిరాకు వేసిందని, ఆయన మాత్రం రిహార్సల్స్‌ అంటూ కవరింగ్‌ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడంటూ శృతి ఆరోపించింది.

ఈ విషయమై ఇప్పటికే అర్జున్‌ స్పందిస్తూ తాను తప్పుడు ఉద్దేశ్యంతో ఆమెతో ప్రవర్తించలేదని, సినిమా షూటింగ్‌లో భాగంగానే తాను అలా చేశాను అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ విషయమై రచ్చ జరుగుతోంది. అర్జున్‌ తీరుపై కొందరు కన్నడ సినీ తారలు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే మరి కొందరు మాత్రం ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. తాజాగా అర్జున్‌ కూతురు ఐశ్వర్య ఈ విషయమై స్పందిస్తూ హీరోయిన్‌ శృతిపై విమర్శలు చేసింది.

సినిమాలో ఇలాంటి సీన్స్‌ ఉంటే ముందే వాటిని తొలగించాం. దర్శకుడితో చెప్పి, రొమాంటిక్‌ సీన్స్‌ ప్రభావం కాస్త తగ్గించాం. ఆమె లేని పోని ఆరోపణలు చేస్తోంది. ఆమెకు ఇలా ఆరోపణలు చేయడం వల్ల సొంత ప్రయోజనం ఉండి ఉంటుందని ఐశ్వర్య ఆరోపించింది. తన తండ్రి కనీసం పబ్‌ లకు క్లబ్‌ లకు కూడా వెళ్లడని, అలాంటిది ఆమెను రిసార్ట్‌కు రమ్మని ఎలా పిలుస్తాడంటూ ఐశ్వర్య చెప్పుకొచ్చింది.

Actress Aishwarya Arjun About Her Father's Eleigations With Sruthi-

అర్జున్‌ చేసిన పనికి క్షమాపణ చెప్పాలిందే అంటూ ప్రకాష్‌ రాజ్‌ వంటి వారు కూడా శృతి హరిహరన్‌కు మద్దతు పలుకుతున్న నేపథ్యంలో ఈ వివాదం చాలా పెద్ద ఇష్యూ అయ్యింది. ఇప్పటి వరకు ఎంతో మంది సెలబ్రెటీలు లైంగిక వేదింపులు ఎదుర్కొన్నారు. అయితే ఇలా ఒక స్టార్‌ హీరో లైంగిక వేదింపులు ఎదుర్కోవడం మాత్రం కన్నడ సినిమా పరిశ్రమతో ప్రారంభం అయ్యింది. ఇది ఎంతదూరం వెళ్తుందో అనే ఆందోళన వ్యక్తం అవుతుంది.