ప్రముఖ నటి రోజా జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.ఫిబ్రవరి 25వ తేదీన ప్రసారమయ్యే ఎక్స్ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది.
ఎక్స్ట్రా జబర్దస్త్ షోకు అతిథిగా హాజరు కాగా ప్రోమోలో రష్మీ, రోజా, ఆమని ఆట సినిమాలోని ఏల ఏల సాంగ్ కు డ్యాన్స్ చేశారు.శుభలగ్నం సినిమాలో ఆమని, రోజా హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో రోజాకు ఆమని డబ్బు కోసం భర్తను అమ్మేయగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.రష్మీ ఈ సినిమా గురించి ప్రస్తావిస్తూ శుభలగ్నం సినిమాలో ఆమని, రోజాలకు అస్సలు పడలేదని ఇక్కడ కూడా అదే కంటిన్యూ చేస్తారా అని అడిగారు.
ఇప్పుడైతే నాకు ఆ సమస్య లేదని రోజా మొగుడు రోజాతో ఉన్నారంటూ ఆమని షాకింగ్ కామెంట్స్ చేయగా రోజా తల కొట్టుకున్నారు.
ప్రోమోలో జడ్జి మనోకు బదులుగా ఆమని హాజరయ్యారు.
ప్రోమోలో ఇమ్మాన్యుయేల్ ఆటో డ్రైవర్ గా ఎంట్రీ ఇవ్వగా వర్ష హైదరాబాద్ లో ఏం చూపిస్తావని ఇమ్మాన్యుయేల్ ను అడుగుతుంది.ఇమ్మాన్యుయేల్ వెంటనే అఫ్జల్ గంజ్, నారాయణ గంజ్ అని చెబుతాడు.
అన్నీ గంజ్ లేనా అని వర్ష అడగగా ఈ గంజి మొహానికి గంజ్ కాకపోతే బెంజ్ చూపెడతారా అంటూ పంచ్ వేశారు.
ఆ తర్వాత ఫైమా ఎంట్రీ ఇచ్చి ఇమ్మాన్యుయేల్ ను ఏం చూపిస్తావని అడగగా మియాపూర్, కొండాపూర్, మాదాపూర్ అని చెప్పగా అన్నీ పూర్ లేనా రిచ్ లేదా అని ఫైమా అడుగుతుంది.
మనకు బొచ్చే లేదు ఇక్కడ రిచ్ ఎందుకు అంటూ ఇమ్మాన్యుయేల్ పంచ్ వేస్తారు. ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.