అప్పట్లో గెస్ట్‌హౌస్‌కు పిలిచేవారు ఆమని సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినిమా పరిశ్రమలో గత కొంత కాలంగా కాస్టింగ్‌ కౌచ్‌ గురించి ప్రముఖంగా చర్చ జరుగుతున్న విషయం తెల్సిందే.ఎంతో మంది హీరోయిన్స్‌ కాస్టింగ్‌ కౌచ్‌ గురించి మాట్లాడారు.

 Actress Aamani Comments On Casting Couch-TeluguStop.com

ఎక్కువ శాతం మంది అవకాశాలు దక్కించుకోవాలంటే కొన్ని సార్లు లైంగిక వేదింపులకు గురి కాక తప్పదని, ఆ వేదింపులను ఆనందంతో స్వీకరించినప్పుడు మాత్రమే తెలుగు సినిమా పరిశ్రమలో నెగ్గుకు రాగలం అంటూ వ్యాఖ్యలు చేశారు.మరి కొందరు మాత్రం అసలు సినిమా ఇండస్ట్రీలో అలాంటిది లేదని, సినిమాల్లో ఒక్కసారి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ప్రతిభ ఆధారంగా అవకాశాలు వస్తాయని అంటున్నారు.

ఏది ఏమైనా కాస్టింగ్‌ కౌచ్‌ అనేది ఇండస్ట్రీలో ఉందని చెప్పుకోవచ్చు.

ఈమద్య కాలంలోనే కాకుండా రెండు మూడు దశాద్దాల క్రితం కూడా కాస్టింగ్‌ కౌచ్‌ ఉండేదంటూ సీనియర్‌ హీరోయిన్స్‌ కూడా అంటున్నారు.గత కొంత కాలంగా జరుగుతున్న చర్చలు ఈ విషయంపై అందరి దృష్టి పడేలా చేస్తుంది.తాజాగా సీనియర్‌ హీరోయిన్‌, ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్టు అయిన ఆమని ఈ విషయంపై స్పందించింది.

తాజాగా ఒక మీడియా సంస్థతో మాట్లాడిన ఆమని అప్పట్లో కూడా కాస్టింగ్‌ కౌచ్‌ ఉండేదని, అమాయకపు అమ్మాయిలను లోబర్చుకునే వారు అంటూ వ్యాఖ్యలు చేసింది.

అప్పట్లో సీనియర్‌ నిర్మాతలు మరియు దర్శకులు ఆడవారిపై ఆశ పడేవారు కాదు, కాని కొత్త కంపెనీలు పెట్టి సినిమాలు నిర్మిస్తామంటూ కొందరు అమాయికపు అమ్మాయిలను మోసం చేసేవారు.

కథ చర్చలు జరపాలి సాయంత్రం గెస్ట్‌హౌస్‌కు రమ్మని పిలిచేవారు.అప్పట్లో గెస్ట్‌హౌస్‌ అంటే ఖచ్చితంగా అందుకే అని అంతా అనుకునేవారు.

గెస్ట్‌హౌస్‌కు వెళ్లడం అంటే మోసపోవడమే, అయినా కూడా కొందరు అవకాశాల కోసం వెళ్లేవారు అంటూ చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం కూడా కొంత మంది కాస్టింగ్‌ కౌచ్‌ బారిన పడుతున్నారని, ప్రతిభ ఉంటే నిర్మాతలు మరియు దర్శకులు వెదుక్కుంటూ వస్తారంటూ ఈ సందర్బంగా ఆమని చెప్పుకొచ్చింది.

ఎన్నో సినిమాల్లో నటించి, ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా వరుసగా చిత్రాలు చేస్తున్న ఆమని కాస్టింగ్‌ కౌచ్‌ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో చర్చకు తెర లేపాయి.కొత్త వారు మాత్రమే కాస్టింగ్‌ కౌచ్‌కు పాల్పడతారు అని, కొందరు సీనియర్‌లు ఆ విషయమై ఆసక్తి చూపించరు అంటూ ఆమె మాటల ద్వారా తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube