పడుకుంటేనే హీరోయిన్లకి డబ్బులు వస్తాయా అంటూ ఫైర్ అయిన హీరోయిన్....  

Actress Madhavi Latha Fire On Netizens - Telugu , Actress Madhavi Latha News, Madhavi Latha, Madhavi Latha Latest News, Madhavi Latha Movie News, Madhavi Latha News

నచ్చావులే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చినటువంటి హీరోయిన్  మాధవిలత ప్రస్తుతం సోషల్ మీడియాలో పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ హల్ చల్ చేస్తోంది.ఇటీవల దేశ రాజధాని ఢిల్లీ నగరంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో  బిజెపి పార్టీ అనుకోని విధంగా ఓటమి పాలైన సంఘటన గురించి సోషల్ మీడియా పరంగా స్పందించిన విషయం తెలిసిందే.

Actress Madhavi Latha Fire On Netizens

అయితే అందుకు గాను ఓ నెటిజన్ అసభ్య పదజాలంతో కామెంట్ చేసినందుకుగాను అతడిపై ఫైర్ అయిన సంఘటన మరువక ముందే మరో మారు  మాధవిలత వార్తల్లో నిలిచింది.

తాజాగా కొందరు నెటిజన్లు ఆమెను మీరు ప్రస్తుతం సినిమాల్లో నటించడం లేదు కదా మీకు డబ్బులు ఎక్కడినుంచి వస్తున్నాయి అంటూ పలు రకాల ప్రశ్నలతో విసిగిస్తున్నారు.

దీంతో మాధవిలత నెటిజన్ల పై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.హీరోయిన్లకి కేవలం సినిమాలు చేస్తేనో లేక పడుకుంటేనో డబ్బులు వస్తాయా అంటూ మండిపడుతోంది.తనకు సినిమాలతో పాటు ఇతర వ్యాపారాలు కూడా ఉన్నాయని దాని ద్వారా డబ్బులు వస్తాయని మండిపడుతూ సమాధానం చెప్పుకొచ్చింది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ అమ్మడు గత కొద్దికాలంగా సినిమా అవకాశాలు లేక సినీ పరిశ్రమకు దూరంగా ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ రాజకీయాల్లో మాత్రం తన వంతు సేవలను బిజెపి పార్టీకి అందిస్తోంది.అయితే మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ కూడా చేసి  అనుకోని విధంగా ఓటమిపాలైంది.దీంతో సోషల్ మీడియాలో మాత్రం తన అభిమానులకి నిత్యం అందుబాటులో ఉంటోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Actress Madhavi Latha Fire On Netizens Related Telugu News,Photos/Pics,Images..

footer-test