బలవంతంగా నాతో పోర్న్ వీడియోలు చేయించారు.. నటి సంచలన వ్యాఖ్యలు?

స్టార్ హీరోయిన్ శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాల కేసులో అరెస్ట్ కాగా ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతుండటం గమనార్హం.తాజాగా గహనా వశిష్ట్ అనే నటి రాజ్ కుంద్రా కేసుకు సంబంధించి మరో కొత్త విషయాన్ని బయటపెట్టారు.

 Actree Sensational Comments About Raj Kundra-TeluguStop.com

ఈ నటి ముంబైకు చెందిన నటి కాగా తనకు ఇష్టం లేకపోయినా బలవంతంగా రాజ్ కుంద్రా తనతో అశ్లీల వీడియోలు చేయించాడని ఆమె చెప్పుకొచ్చారు.ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో అశ్లీల చిత్రాల ఆరోపణల కేసులో గహనా వశిష్ట్ అరెస్ట్ అయ్యారు.

ఈ నటి బెయిల్ పై బయటకు రాగా ఈ నటి వెల్లడించిన విషయాలు చర్చనీయాంశం అవుతున్నాయి.పోలీసుల విచారణలో రాజ్ కుంద్రాకు సంబంధించి ఎన్నో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

 Actree Sensational Comments About Raj Kundra-బలవంతంగా నాతో పోర్న్ వీడియోలు చేయించారు.. నటి సంచలన వ్యాఖ్యలు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

భర్త చేసిన పనుల వల్ల ఆర్థికంగా నష్టపోవడంతో పాటు తన పరువుప్రతిష్టలకు భంగం కలిగిందని శిల్పాశెట్టి చెప్పినట్టు సమాచారం.ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు బాధితుల నుంచి పదుల సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నట్టు సమాచారం.

మరోవైపు రాజ్ కుంద్రా బెయిల్ కోసం ప్రయత్నాలు చేయగా ముంబై కోర్టు బెయిల్ ను తిరస్కరించడం గమనార్హం.ప్రస్తుతం కేసు దర్యాప్తు జరుగుతుండటంతో పాటు రాజ్ కుంద్రాను బెయిల్ పై విడుదల చేస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉండటంతో కోర్టు బెయిల్ కు నిరాకరించింది.

మరోవైపు అతని కంపెనీ ఉద్యోగులే వ్యతిరేకంగా సాక్ష్యాలు చెప్పడానికి ముందుకు వస్తున్నట్టు సమాచారం.

Telugu Gahana Vashisht, Police Enquiry, Raj Kundra, Sensational Comments-Movie

ఈ కేసులో ర్యాన్ ఖార్పో మరో నిందితుడు కాగా అతనిని బెయిల్ పై రిలీజ్ చేస్తే ఐటీ నిపుణుడు కావడంతో ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులు చెప్పినట్టు సమాచారం.రాజ్ కుంద్రాకు ఇప్పట్లో బెయిల్ రావడం కష్టమేనని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

#Police Enquiry #Raj Kundra #Gahana Vashisht

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు