తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటులలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటులు బాబు మోహన్, కోట శ్రీనివాసరావు( Babu Mohan, Kota Srinivasa Rao ).వీళ్ళ కాంబినేషన్ అనేది మనందరికీ చాలా గుర్తుండిపోతుంది.
నిజానికి వీళ్ళు చేసిన కామెడీ అనేది ప్రతి సినిమాలో కూడా ప్రేక్షకులని విపరీతంగా అలరిచ్చేది.అందుకే వీళ్ళిద్దరి కోసం అప్పట్లో ప్రతి సినిమాలో కూడా స్పెషల్ క్యారెక్టర్ రాసుకొని మరి తీసుకొని వీళ్లచేత కామెడీ చేయించేవారు.

ఇక ఇదిలా ఉంటే ఇక రీసెంట్ గా అజయ్ భూపతి( Ajay Bhupathi ) డైరెక్షన్ లో వచ్చిన మంగళవారం సినిమా మంచి విజయాన్ని సాధించింది.అయితే ఈ సినిమాలో నటించిన నటులందరికి మంచి పేరు రాగా, అజయ్ ఘోష్, లక్ష్మణ్( Ajay Ghosh, Laxman ) లు మాత్రం కామెడీ క్యారెక్టర్లు చేసి తమకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్నారు.ఇక ముఖ్యంగా వీళ్ళ క్యారెక్టర్ లను చూస్తుంటే ఒకప్పుడు బాబు మోహన్, కోట శ్రీనివాసరావు మధ్య ఎలాంటి కామెడీ అయితే జనరేట్ అయ్యేదో అలాంటి కామెడీ వీళ్ళ మధ్య కూడా జనరేట్ అయిందని చాలామంది ప్రేక్షకులు వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

నిజానికి మంగళవారం సినిమా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కినప్పటికీ ఈ సినిమాలో వీళ్లు అవకాశం దొరికిన ప్రతిసారి ప్రేక్షకులకు కితకితలు పెట్టించారు.ఇక దాంతో ఈ సినిమా అనేది అధ్యంతం కామెడీ గా సాగుతూ ఉంటుంది.అక్కడక్కడ ప్రేక్షకులకు నవ్వులు పూయించింది.
ఇక ఇలాంటి క్రమంలో అజయ్ భూపతి ఫ్లాప్ తర్వాత ఈ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు ఇక నెక్స్ట్ ఆయన ఎవరితో సినిమా చేస్తారనేది తెలియాల్సి ఉంది.ఇక ఇది ఇలా ఉంటే మంగళవారం సినిమా మంచి విజయం సాధించడం తో చిన్న సినిమాలు అన్ని కూడా తమ సినిమాలను భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి.








