స్వగ్రామానికి వివేక్ అస్థికలు.. ఆ పని చేసి షాకిచ్చిన గ్రామస్థులు..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది నటులు ఉన్నప్పటికీ కొందరు నటులు మాత్రం తమ సినిమాలతో ప్రేక్షకుల హృదయాల్లో చెరిగిపోని ముద్ర వేస్తారు.అలా చెరిగిపోని ముద్ర వేసిన నటుల్లో తమిళ కమెడియన్ వివేక్ ఒకరు.

 Actor Viveks Ashes Were Used To Plant Saplings In His Ancestral Village, Actor V-TeluguStop.com

కొన్నిరోజుల క్రితం కరోనా వ్యాక్సిన్ సెకండ్ డోస్ తీసుకున్న మరుసటి రోజే గుండె సంబంధిత సమస్యల వల్ల వివేక్ మృతి చెందారు.వివేక్ మృతికి వ్యాక్సిన్ కారణమని అనుమానాలు వ్యక్తమైనా అధికారులు ఆ ఆరోపణలను ఖండించారు.

వివేక్ ఆకస్మిక మరణం పట్ల కోలీవుడ్ సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.విరుగంబక్కం అనే ప్రాంతానికి సమీపంలో ఉన్న స్వశానవాటికలో వివేక్ దహన సంస్కారాలు జరగగా అతని కుటుంబ సభ్యులు వివేక్ అస్థికలను వివేక్ పూర్వీకుల ఊరైన పెరుంగటూర్ కు పంపారు.

అక్కడ ఉన్న వివేక్ బంధువులు, గ్రామస్థులు వివేక్ అస్థికలను మొక్కలు నాటడానికి ఉపయోగించడం గమనార్హం.

ప్రకృతి ప్రేమికుడైన వివేక్ కోటి చెట్లు నాటాలని లక్ష్యంగా పెట్టుకుని చనిపోయే వరకు ఏకంగా 33 లక్షల మొక్కలను నాటారు.2011 సంవత్సరంలో గ్రీన్ కలాం ప్రాజెక్ట్ ను ప్రారంభించి తన అభిమానులను కూడా మొక్కలు నాటాలని వివేక్ పిలుపునిచ్చారు.వివేక్ చివరగా బిగిల్ అనే సినిమాలో నటించారు.

బిగ్ బాస్ సీజన్ 4 తమిళ్ కంటెస్టెంట్ రమ్య వివేక్ మృతి తర్వాత 59 మొక్కలు నాటారు.

Telugu Vivek, Ancestral, Tamil-Movie

వివేక్ వయస్సు 59 సంవత్సరాలు కావడంతో ఆమె 59 మొక్కలను నాటినట్లు వెల్లడించారు.వివేక్ భౌతికంగా దూరమైనా హృదయాల్లో మాత్రం ఎప్పటికీ ఉంటారని ఆమె చెప్పుకొచ్చారు.శంకర్ దర్శకత్వం వహించిన సినిమాల ద్వారా వివేక్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమయ్యారు.

రఘువరన్ బీటెక్, శివాజీ, అపరిచితుడు సినిమాలు వివేక్ కు కమెడియన్ గా మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి.వివేక్ హీరోగా కూడా కొన్ని సినిమాల్లో నటించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube