బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ కు బెదిరింపులు  

Actor Vivek Oberoi Get Threat Call-

ఇటీవల సంచలన ట్వీట్ చేసి మహిళల మనోభావాలు దెబ్బ తీశాడు అంటూ విమర్సలు ఎదుర్కొన్న బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ కు బెదిరంపు కాల్స్ వచ్చినట్లు తెలుస్తుంది.కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి వివేక్ కు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది.నక్సలైట్ ల పేరుతో ఆ కాల్ వచ్చింది అని ముంబై పోలీసులకు ఒబెరాయ్ ఫిర్యాదు చేసినట్లు సమాచారం..

Actor Vivek Oberoi Get Threat Call--Actor Vivek Oberoi Get Threat Call-

ఈ నేపథ్యంలో ప్రస్తుతం వివేక్ నివాసం వద్ద ముంబై పోలీసులు భారీ గా బందోబస్తు ఏర్పాటు చేశారు.అయితే మరో విషయం ఏమిటంటే వివేక్ ఓబెరాయ్ ప్రధాన పాత్రలో నటించిన పీఎం నరేంద్ర మోదీ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సమయంలో నక్సలైట్ ల పేరుతో వివేక్ కు బెదిరింపు కాల్స్ రావడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.ఇటీవల కొద్దీ రోజుల క్రితం తోటి నటి ఐశ్వర్య రాయ్ ని కించపరిచేలా ఒబెరాయ్ చేసిన పోస్ట్ తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.

పెళ్లి అయిన పాప తో హ్యాపీ గా ఉంటున్న ఐశ్వర్య ని కించపరుస్తూ ఆ విధంగా పోస్ట్ పెట్టడం పై పలువురు సినీ ప్రముఖుల తో పాటు, క్రీడారిని గుత్తా జ్వాలా కూడా మండిపడ్డారు.ఈ క్రమంలో మహిళా కమీషన్ కూడా ఐశ్వర్యకు క్షమాపణలు చెప్పాలని కోరుతూ వివేక్ కు నోటీసులు అందించింది.అయితే ఇంతమంది అతడిపై విమర్సలు చేయడం తో ఎట్టకేలకు క్షమాపణలు చెప్పి ఆ వివాదం నుంచి బయటపడ్డాడు.