విశ్వక్ సేన్ ను దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. కారణం అదేనా?

వెండితెరపైకి మాస్ యాక్షన్ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చినటువంటి హీరో విశ్వక్ సేన్.మొదటి చిత్రంతోనే మాస్ హీరోగా పేరు సంపాదించుకున్న ఈ హీరో ఆ తర్వాత పలు సినిమాలలో నటించి అందరిని మెప్పించాడు.

 Paagal Pre Release Event, Actor Vishwak Sen , Trolings , Social Media,latest Tol-TeluguStop.com

ఈ క్రమంలోనే విశ్వక్, నివేదా పేతురాజ్ జంటగా నరేష్ కొప్పిలి దర్శకత్వంలో, దిల్ రాజు సమర్పణలో బెక్కం వేణుగోపాల్ నిర్మించినటువంటి చిత్రం “పాగల్”.ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ఆగస్ట్ 14 న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.

ఈ క్రమంలోనే ఈ వేడుకకు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా హీరో విశ్వక్ మాట్లాడుతూ కొన్ని సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ సందర్భంగా విశ్వక్ మాట్లాడుతూ…ఇది రిలీజ్ ఈవెంట్ కాదు.

ఇది సక్సెస్ మీట్ అంటూ మాట్లాడిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.అవును ఈ రోజు మధ్యాహ్నమే ఈ సినిమా చూశాను ఎంతో అద్భుతంగా వచ్చింది ఈ సినిమా విజయవంతం కావడం పక్కా అందుకే సక్సెస్ మీట్ అంటున్నా అంటూ వివరణ కూడా ఇచ్చారు.

Telugu Vishwak Sen, Paagal Pre-Movie

ఈ సందర్భంగా హీరో మాట్లాడుతూ ఈ సినిమా కథ ఏంటి అనే విషయాన్ని కూడా బయట పెట్టేశారు.ఈ సందర్భంలోనే విశ్వక్ మాట్లాడుతూ అన్ని సినిమాలు సాధారణంగా శుక్రవారం విడుదల అవుతాయి కానీ మేము పాగల్ కాబట్టి మా సినిమాను 14వ తేదీ శనివారం విడుదల చేస్తున్నామని తెలిపారు.హీరో విశ్వక్ సీన్ ఈ విధంగా మాట్లాడటంతో నెటిజన్లు తనని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.తెలుగు సినిమా ఇండస్ట్రీలో రికార్డులు సృష్టించిన బాహుబలి సినిమా గురించి కూడా ప్రభాస్ ఈ విధంగా మాట్లాడలేదు.

పట్టుమని పది సినిమాలు కూడా తీయలేదు ఇతనికి ఇంత కాన్ఫిడెన్స్ ఏంటో అంటూ నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.ఈ సందర్భంగా మరికొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తూ ఏ హీరోకైనా తమ సినిమా గురించి కాన్ఫిడెన్స్ ఉంటుంది.

కానీ విశ్వక్ కి మాత్రం ఓవర్ కాన్ఫిడెన్స్ ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.చూడాలి మరి ఇతని ఓవర్ కాన్ఫిడెన్స్ ఎంత వరకు సక్సెస్ అవుతుందో లేదో అనేది తెలియాలంటే 14వ తేదీ వరకు వేచి ఉండాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube