పిల్లల్ని కనకపోవడానికి కారణం చెప్పిన వరుణ్ సందేశ్.. ఏమైందంటే?

ఈ మధ్య కాలంలో సినిమాలు, రియాలిటీ షోల ద్వారా గుర్తింపును సొంతం చేసుకున్న సెలబ్రిటీలు యూట్యూబ్ ఛానెల్స్ పై దృష్టి పెడుతున్నారు.సినిమాల ద్వారా సంపాదించే మొత్తానికి సమానంగా యూట్యూబ్ ద్వారా సంపాదించే ఛాన్స్ ఉండటంతో సెలబ్రిటీలు యూట్యూబ్ ఆదాయాన్ని వదులుకోవడానికి అస్సలు ఇష్టపడటం లేదు.

 Actor Varun Sandesh Interesting Comments About Kids  ,actor , Varun Sandesh , Ki-TeluguStop.com

బిగ్ బాస్ సీజన్3లో పాల్గొనడం ద్వారా వితికా షేరు పాపులారిటీని సంపాదించుకున్నారు.

బిగ్ బాస్ షో తర్వాత పలు షోలకు వితికా షేరు యాంకర్ గా పని చేశారు.

అయితే ఆ షోలు అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేదు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వరుణ్ సందేశ్ వితిక యూట్యూబ్ ఛానెల్ ద్వారా సంపాదిస్తున్న మొత్తం గురించి, పిల్లల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా ఒకే విధంగా ఉండాలని వరుణ్ సందేశ్ పేర్కొన్నారు.ఏ రంగంలో అయినా పరిస్థితుల వల్ల అవతలి వ్యక్తుల ప్రవర్తనలో మార్పు వస్తుందని వరుణ్ అన్నారు.

లైఫ్ అనేది సాగుతుందని ఆ లైఫ్ ను బెస్ట్ గా మనం తీసుకోవాలని వరుణ్ సందేశ్ చెప్పుకొచ్చారు.ఒకప్పుడు వరుసగా సినిమాలు చేశానని కొన్ని సినిమాలు సరిగ్గా ప్రమోషన్స్ లేకుండా రిలీజయ్యాయని వరుణ్ సందేశ్ వెల్లడించారు.

వితిక డిజైనింగ్ కూడా చేస్తుందని వరుణ్ సందేశ్ అన్నారు.వితిక అంటే చాలా గర్వపడతానని యూట్యూబ్ ఛానల్ ద్వారా తన భార్య భారీ మొత్తంలో సంపాదిస్తోందని వరుణ్ సందేశ్ పరోక్షంగా చెప్పుకొచ్చారు .

Telugu Big Boss, Enduvadana, Varun Sandesh, Vithika, Tube-Movie

వితిక నా కంటే ఐదు సంవత్సరాల చిన్న అని వరుణ్ సందేశ్ అన్నారు.వితికకు కొన్ని లక్ష్యాలు, కలలు ఉన్నాయని నాకు కూడా కొన్ని ప్రణాళికలు ఉన్నాయని అందువల్లే పిల్లల్ని ఆలస్యంగా కనాలని నిర్ణయం తీసుకున్నామని తనకు ఎదురైన ప్రశ్నకు వరుణ్ సమాధానం ఇచ్చారు.వరుణ్ సందేశ్ నటించి విడుదలైన ఇందువదన సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేదనే సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube