ఎన్టీఆర్ గురించి నేను అన్న మాటలని తప్పుగా ప్రచారం చేసారు.. కానీ...

తెలుగులో కమేడియన్ పాత్రలలో మరియు నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి పాత్రలలో నటించి వెండితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ నటుడు “ఉత్తేజ్” గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే నటుడు ఉత్తేజ్ కేవలం నటుడిగా మాత్రమే కాకుండా పలు చిత్రాలకు డైలాగ్ రైటర్ గా కూడా పని చేశాడు.

 Actor Uttej Give Clarity About Clash With Jr Ntr In Tollywood Film Industry, Utt-TeluguStop.com

ఇందులో అప్పట్లో మంచి విజయం సాధించిన నిన్నే పెళ్ళాడతా, ఖడ్గం, మనీ మనీ, తదితర చిత్రాలకు అడిషనల్ డైలాగ్ రైటర్ గా పని చేసి తన డైలాగులతో అదరగొట్టాడు.కాగా నటుడు ఉత్తేజ్ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని ఓ ఇంటర్వ్యూ లో  తాను జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడని మాటలను కొంతమంది వక్రీకరించి తన గురించి తప్పుడు ప్రచారం చేశారని వాపోయాడు.

తనకు టాలీవుడ్ సినిమా పరిశ్రమలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టం, అభిమానమని దాంతో ఎన్టీఆర్ డాన్స్ మరియు నటనకి తన ఫిదా అయ్యానని తెలిపాడు.కానీ గతంలో ఓసారి సీనియర్ ఎన్టీఆర్ పై ఉన్నటువంటి అభిమానంతో ఆయన మరణానంతరం తన ఆత్మ ఎక్కడికి వెళ్లాలో తెలియక జూనియర్ ఎన్టీఆర్ లో చేరిందని కామెంట్లు చేశానని దీంతో కొందరు యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు ఏకంగా ఎన్టీఆర్ గుట్టు విప్పిన ఉత్తేజ్ అంటూ కొంతమేర అసభ్యకరంగా ఉండేటువంటి థంబ్ నౌల్స్ క్రియేట్ చేసి తన గురించి తప్పుడు ప్రచారాలు చేశారని చెప్పుకొచ్చాడు.

అందువల్లనే తాను యూట్యూబ్ ఛానళ్ళకి ఇంటర్వ్యూలు ఇవ్వడం లేదని కూడా స్పష్టం చేశాడు.అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం అలాంటి వాటిని అసలు పట్టించుకోడని ఎవరో ఏదో చెప్పినంత మాత్రాన తమ మధ్య ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలకి ఎలాంటి అడ్డంకులు ఏర్పడవని తెలిపాడు.

అయితే అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన “రాఖీ” చిత్రానికి తాను డైలాగ్ రైటర్ గా పని చేశానని ఈ చిత్రంలోని క్లైమాక్స్ కోర్టు సన్నివేశాలకు డైలాగులను తానే అందించానని తెలిపాడు.కాగా నాలుగు పేజీల డైలాగ్ అయినా సరే జూనియర్ ఎన్టీఆర్ ఒకసారి చూస్తే చాలు ఇట్టే చెప్పేస్తాడని, అంత నటనా ప్రతిభ ఉన్నటువంటి నటుడిని తాను ఇప్పటివరకు చూడలేదని కూడా తెలిపాడు.

కాగా ప్రస్తుతం తాను ఓ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నానని తన ప్రాణం ఉన్నంత వరకు తన ఇనిస్టిట్యూట్లో చేరిన విద్యార్థులను మంచి నటులగా తయారు చేస్తానని చెప్పుకొచ్చాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube