లవ్ యూ పద్దమ్మా.. భార్య పుట్టినరోజున ఉత్తేజ్ ఎమోషనల్ పోస్ట్!

Actor Uttej Emotional Post Goes Viral In Social Media

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉత్తేజ్ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.ఉత్తేజ్ భార్య పద్మ కొన్నిరోజుల క్రితం మృతి చెందారనే సంగతి తెలిసిందే.

 Actor Uttej Emotional Post Goes Viral In Social Media-TeluguStop.com

క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతూ పద్మ మృతి చెందారు.పద్మ చనిపోయిన సమయంలో ఉత్తేజ్ ఎంతో బాధ పడిన సంగతి తెలిసిందే.

ఉత్తేజ్ ను చూసి స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి సైతం బాధ పడ్డారు.ఈరోజు పద్మ పుట్టినరోజు.

 Actor Uttej Emotional Post Goes Viral In Social Media-లవ్ యూ పద్దమ్మా.. భార్య పుట్టినరోజున ఉత్తేజ్ ఎమోషనల్ పోస్ట్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పద్మ బర్త్ డే కావడంతో ఉత్తేజ్ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

తన భార్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూనే తన బాధను ఉత్తేజ్ నెటిజన్లతో పంచుకున్నారు.

తన భార్య ఉన్నంతకాలం తనకు పరిష్కారంగా నిలిచిందని అయితే ఇప్పుడు ప్రశ్ననిచ్చి వెళ్లిపోయిందని ఉత్తేజ్ చెప్పుకొచ్చారు.చాలా నొప్పిగా ఉంది పద్దూ అంటూ ఉత్తేజ్ తన మనస్సులోని బాధను పంచుకున్నారు.

చివరి శ్వాసతోనే తన భార్య తనలోనుంచి వెళుతుందని ఉత్తేజ్ కామెంట్లు చేశారు.

యూఖ పిల్లలంతా తన భార్యను గుర్తు చేసుకుంటూనే ఉన్నారని ఉత్తేజ్ పేర్కొన్నారు.

నా వాళ్లంతా తనవాళ్లే అని నా సమస్యలంతా తన సమస్యలే అని భార్య భావించిందని ఎన్ని కష్టాలు పడినా తన భార్య ఏడేడు లక్షల అడుగులు తనతో నడించిందని ఉత్తేజ్ అన్నారు.కలలన్నీ సాకారం చేసుకునే సమయంలో తన భార్య కలగా మిగిలి వెళ్లిపోయిందని ఉత్తేజ్ చెప్పుకొచ్చారు.

తన భార్యకు సహపంక్తి భోజనం అంటే ఎంతో ఇష్టమని ఉత్తేజ్ అన్నారు.ఉత్తేజ్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఉత్తేజ్ చేసిన పోస్ట్ కు 6,000కు పైగా లైక్స్ వచ్చాయి.ఉత్తేజ్ కు ధైర్యం చెబుతూ నెటిజన్లలో చాలామంది కామెంట్లు పెడుతున్నారు.కొంతమంది నెటిజన్లు తమ బాధను కామెంట్ల రూపంలో పంచుకుంటున్నారు.

#Uttej

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube