ప్రముఖ నటుడి భార్య అనుమానాస్పద మృతి.. కట్నం వల్లేనా..?

మలయాళంలో పదుల సంఖ్యలో సినిమాల్లో నటించడం ద్వారా ఉన్నిరాజన్ పీ దేవ్ మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.ఉన్నిరాజన్ మలయాళంతో పాటు తెలుగు, ఇతర భాషల సినిమాల్లో నటించారు.

 Actor Unni Rajan P Dev S Wife Priyanka Forced To Commit Suicide-TeluguStop.com

అయితే ఈ నటుడి భార్య ప్రియాంక అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా వరకట్న వేధింపుల వల్లే ఈ నటి మృతి చెందినట్టు తెలుస్తోంది.ప్రియాంక ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నిరాజన్ పైనే అనుమానాలు వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

ఉన్నికృష్ణన్ భార్య ప్రియాంకను దారుణంగా హింసించే వారని.వేధింపులకు పాల్పడటంతో పాటు భార్యకు ఉన్నిరాజన్ కొట్టేవారని ప్రియాంక కుటుంబ సభ్యులు చెబుతున్నారు.శారీరకంగా భర్త హింసిస్తున్నా ఆ విషయాన్ని మొదట తమకు కూడా చెప్పలేదని వేధింపులు శృతి మించడంతో భర్త ఉన్నిరాజన్ పై ప్రియాంక పోలీస్ స్టేషన్ లో కేసు కూడా పెట్టారని ప్రియాంక కుటుంబ సభ్యులు అన్నారు.పోలీస్ స్టేషన్ లో ప్రియాంక భర్తపై కేసు పెట్టిన మరుసటి రోజే ఆత్మహత్యకు పాల్పడటం గమనార్హం.

 Actor Unni Rajan P Dev S Wife Priyanka Forced To Commit Suicide-ప్రముఖ నటుడి భార్య అనుమానాస్పద మృతి.. కట్నం వల్లేనా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రియాంక, ఉన్నిరాజన్ ఒకరినొకరు ప్రేమించుకొని వివాహం చేసుకోగా పెళ్లి తరువాత వీళ్లిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి.

Telugu Dowry, Khushi Actor Son, Malayalam, Malayalam Actor, Priyanka Commit Suicide, Priyanka Parents, Rajan P Dev Son, Unnikrishnan, Unnirajan, Wife Suicide-Movie

వ్యక్తిగత ఖర్చుల నిమిత్తం ప్రియాంక నగలను అమ్మిన ఉన్నిరాజన్ ప్రియాంక తల్లి నుంచి ఖర్చుల కోసం డబ్బు తీసుకున్నారు.అయితే కట్నం డబ్బు కోసం ఉన్నిరాజన్ ప్రియాంకను విపరీతంగా వేధించేవారు.రోజురోజుకు భర్త పెట్టే చిత్రహింసలు ఎక్కువ కావడంతో ఆమె ఆత్మహత్య చేసుకున్నారు.

రాజన్ పీ దేవ్ మలయాళ ఇండస్ట్రీలో ప్రముఖ నటుదు కాగా ఉన్నిరాజన్ ఆయన కొడుకే కావడం గమనార్హం.రాజన్ పీ దేవ్ తెలుగులో ఖుషి సినిమాతో పాటు మరికొన్ని సినిమాల్లో నటించారు.2019 సంవత్సరంలో ప్రియాంక ఉన్నికృష్ణన్ వివాహం జరగగా పోలీసుల దర్యాప్తు తరువాత ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

#PriyankaCommit #Wife Suicide #Malayalam #Dowry #Unnirajan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు