1992 లో తలైవాసాల్ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన విజయ్ తన తొలి సినిమా టైటిల్ నే ఇంటి పేరుగా మార్చుకున్నారు.2010వ సంవత్సరంలో యుగపురుషన్ అనే సినిమాలో నారాయణ్ గురు పాత్ర పోషించి ప్రేక్షకులను ఎంతగానో అలరించారు.సపోర్టింగ్ రోల్స్ తో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా 25 సంవత్సరాల పాటు నటించిన ఆయన 200 సినిమాల్లో కనిపించారు.1995 లో స్త్రీ అనే తెలుగు చిత్రంలో విజయ్ నటించి మెప్పించారు.తేజ దర్శకత్వంలో తెరకెక్కిన కేక సినిమాలో కూడా ఆయన నటించారు.అంతే కాదు మరో చరిత్ర, గగనం, భాగమతి వంటి సినిమాల్లో కీలక పాత్రలలో నటించి మెప్పించారు.
ఈయన మంచి నటుడు మాత్రమే కాదు మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా.జేడీ చక్రవర్తి వంటి హీరోలకు తమిళంలో డబ్బింగ్ చెప్పారు.
ఇక విజయ్ యొక్క కుటుంబ విషయానికి వస్తే ఆయనకు ఒక కుమారుడు, ఒక కూతురు ఉన్నారు.ఆయన కుమార్తె స్విమ్మింగ్ రంగంలో సంచలనాలు సృష్టిస్తున్నారు.
ఆమె మరెవరో కాదు జయవీణ.శ్రీ రామచంద్ర యూనివర్సిటీ నుంచి బి.ఎస్.సి స్పోర్ట్స్ సైన్స్ లో పట్టభద్రురాలైన ఆమె మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించారు.ఆమె స్విమ్మింగ్ లో 3 బంగారు, 2 వెండి, 1 రజత పతకాలు సాధించారు.ఆలిండియా యూనివర్సిటీ ఛాంపియన్షిప్ లో చండీగర్ లో జరిగిన పోటీలలో ఈ పతకాలను సాధించారు.
రెండున్నర ఏళ్ల వయసు నుంచే ఈమె స్విమ్మింగ్ నేర్చుకునేవారు.చిన్నప్పుడే 9 అడుగుల స్విమ్మింగ్ పూల్ లో ధైర్యంగా దూకి ఈత కొట్టి ఆశ్చర్యపరిచారు.
అయితే చిన్న వయసులోనే తన కూతురిలో స్విమ్మింగ్ టాలెంట్ ని చూసిన విజయ్ ఆమెను బాగా ప్రోత్సహించారు.జయవీణ 2011 సంవత్సరంలో రాంచీలో నిర్వహించిన ఇండియన్ నేషనల్ గేమ్స్ లో 200 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్ స్విమ్మింగ్ పోటీలో పాల్గొని శరవేగంగా ఈత కొట్టి ఒక బ్రాంజ్ మెడల్ గెలుచుకొని ఆశ్చర్య పరిచారు.12 ఏళ్ళ వయసులోనే పతకం గెలుచుకోవడంతో ఆమె పేరు భారత దేశ వ్యాప్తంగా మార్మోగింది.దీంతో ఒక్కసారిగా ఆమె పాపులారిటీ పెరిగిపోయింది.
విజయ్ చిన్న కుమారుడు జైవంత్ కూడా స్విమ్మింగ్ లో చాంపియన్ గా నిలిచారు.
అయితే తమ పిల్లలు స్విమ్మింగ్ రంగంలో దూసుకెళ్తున్నారు అని.ఇండియా మొత్తంలో బాగా రాణిస్తున్నారని అందుకు గాను అతనికి చాలా సంతోషంగా ఉందని విజయ్ చెబుతుంటారు.ఇటీవల ఆమె నేపాల్ రాజధాని ఖాట్మండు లో నిర్వహించిన 13వ సౌత్ ఆసియన్స్ గేమ్స్ లో 50 మీటర్ల స్విమ్మింగ్ రేస్ లో వెండి పతకం గెలుచుకున్నారు.
చిన్నతనంలో కూడా ఆమెలో ఎంతో ప్రతిభ ఉంది కానీ ఎగ్జామ్స్ వల్ల ఆమె చాలా టోర్నమెంట్ లలో పాల్గొని లేకపోయారు.ప్రస్తుతం ప్రతిరోజు ఉదయం నాలుగున్నర గంటల సమయంలో నిద్ర లేచి ఆమె ప్రాక్టీస్ చేస్తారట.
ఒలంపిక్స్ లో కూడా గోల్డ్ మెడల్ సాధించే దిశగా ఆమె సిద్ధమవుతున్నారు.అయితే విజయ్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిభ ఉన్న వారిని ప్రోత్సహించి ఉచిత శిక్షణ కల్పించాలని.
అలా అయితేనే మన భారతదేశానికి ఒలంపిక్స్ లో ఎన్నో పతకాలు వస్తాయని అంటున్నారు.
అయితే వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్ లో పాల్గొని అందర్నీ ఓడించడమే తన ధ్యేయమని జయవీణ చెబుతున్నారు.
అలాగే ఇతర అన్ని సిమ్మింగ్ పోటీలలో గెలుస్తూ ఉంటూనే తనకు ఒలంపిక్స్ లో చోటు దక్కించుకునే అవకాశం ఉంటుందని.అందుకోసం తాను నిరంతరాయంగా ప్రాక్టీస్ చేస్తూ అందర్నీ ఓడించుకుంటూ పోవాలని చెబుతున్నారు.
ఏది ఏమైనా అతి త్వరలోనే విజయ్ కూతురు ఇండియా కి గర్వకారణం కాబోతున్నారని తెలుస్తోంది.