ప్రకాష్ రాజ్ ఏమైనా పాకిస్థాన్ నుంచి వచ్చాడా.. నటుడి షాకింగ్ కామెంట్స్!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సమయంలో విష్ణు ప్యానల్ సభ్యులు ప్రకాష్ రాజ్ తెలుగు వ్యక్తి కాదని కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.టార్జాన్ లక్ష్మీనారాయణ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు ఇండస్ట్రీలో వచ్చిన పేరు, గుర్తింపుతో సంతోషంగా ఉందని అన్నారు.

 Actor Tarzan Laxminarayana Interesting Comments About Prakash Raj-TeluguStop.com

మాది రాపోలు అనే ఊరు అని టార్జాన్ లక్ష్మీనారాయణ తెలిపారు.ఆకలితో కష్టాలు అనుభవించిన రోజులు తన జీవితంలో ఉన్నాయని టార్జాన్ చెప్పుకొచ్చారు.

ఎన్ని వందల కోట్ల సంపాదన ఉన్నా జీవితం మారిపోవడానికి క్షణాలు చాలని టార్జాన్ అన్నారు.100 కోట్లు ఉన్నా చావును ఆపడం సాధ్యం కాదని టార్జాన్ అన్నారు.జీవితం గురించి తలచుకుంటే నవ్వు వస్తుందని టార్జాన్ చెప్పుకొచ్చారు.నరేష్ చాలా మంచి వ్యక్తి అని అయితే తనకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు ఏం చేస్తారనేది తనకు ముఖ్యం కాబట్టి ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో చేరానని టార్జాన్ అన్నారు.

 Actor Tarzan Laxminarayana Interesting Comments About Prakash Raj-ప్రకాష్ రాజ్ ఏమైనా పాకిస్థాన్ నుంచి వచ్చాడా.. నటుడి షాకింగ్ కామెంట్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నేను ఈసీ మెంబర్ గా అందరికీ మంచి చేయాలనే అనుకుంటానని టార్జాన్ తెలిపారు.నటుడు చెబితే వందలు వేల మంది వింటారని చిన్నచిన్న ఈగోస్ వల్ల గొడవలు జరుగుతున్నాయని టార్జాన్ అన్నారు.

ప్రకాష్ రాజ్ రెండు ఊర్లను దత్తత తీసుకున్నాడని, ఎంతోమందికి సహాయం చేశాడని ఆయనపై ఉన్న నమ్మకంతో తాను ఆయన ప్యానల్ లో చేరానని టార్జాన్ పేర్కొన్నారు.ప్రకాష్ రాజ్ తెలుగు వ్యక్తి కాదని అంటున్నారని ప్రకాష్ రాజ్ పాకిస్తాన్ నుంచి వచ్చాడా? అని టార్జాన్ ప్రశ్నించారు.

Telugu Interesting Comments, Maa Association, Prakash Raj, Tarzan Laxminarayana-Movie

సోనూసూద్ ను ఇతర భాషా నటుడని చెబుతారా? అంటూ టార్జాన్ ప్రశ్నించారు.మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బిల్డింగ్ కాకుండా చాలా సమస్యలు ఉన్నాయని టార్జాన్ అన్నారు.మన నటులలో చాలామందికి అవకాశాలు దక్కడం లేదని టార్జాన్ పేర్కొన్నారు.టార్జాన్ చెప్పిన మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

#MAA #Prakash Raj

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube