పెళ్లి కొడుకు అయిన హీరో తరుణ్.. అమ్మాయి ఆమేనా?

తెలుగు సినీ నటుడు, లవర్ బాయ్ తరుణ్ గురించి తెలియని వారెవ్వరూ ఉండరు.బాలనటుడిగా సినీ పరిశ్రమకు అడుగుపెట్టిన తరుణ్ ఆ తర్వాత హీరోగా పరిచయమయ్యాడు.

 Hero Tarun Marriage News Viral In Social Media, Hero Tarun, Marriage News, Roja-TeluguStop.com

నువ్వేకావాలి సినిమా లో నటించి ఆ సినిమాతో మంచి క్రేజ్ ను అందుకున్నాడు తరుణ్.ఎక్కువగా లవ్ ఎంటర్ టైన్ మెంట్ తో తెరకెక్కిన సినిమాలలో నటించిన తరుణ్ కు లవర్ బాయ్ అనే పేరు వచ్చింది.ఇక ఈయన సినిమాలు అంటే అప్పటి యూత్ కు తెగ నచ్చేవి.1990 అంజలి సినిమా తో బాలనటుడిగా వచ్చిన తరుణ్.ఈ సినిమాలో తన నటనకు బాల నటుడి అవార్డు దక్కింది.ఇక ఆ తర్వాత వరుస సినిమాలలో అవకాశాలను అందుకున్నాడు తరుణ్.

ఇదిలా ఉంటే 2011లో చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి సినిమా లో ఆఖరిగా నటించగా.అప్పటినుండి సినీ పరిశ్రమకు దూరమయ్యాడు.

ఈ సినిమాకు ముందు తరుణ్ కు పలు సినిమాలలో అంతగా విజయం లేకపోయేసరికి.మళ్లీ అవకాశాలు కూడా అందుకోలేదు.

అంతేకాకుండా ఆ సమయంలో పలువురు యంగ్ హీరోలు పరిచయం కాక తరుణ్ అవకాశాలు పూర్తిగా తగ్గాయి.దీంతో బిజినెస్ వైపు అడుగులు వేసిన తరుణ్ 2018లో ఇది నా లవ్ స్టోరీ అనే సినిమాలో నటించాడు.

కానీ సినిమా తరుణ్ కు అంత గుర్తింపు ఇవ్వలేకపోయింది.దీంతో తరుణ్ మళ్లీ సినిమాలకు దూరం అవ్వగా.

త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


గత ఏడాది కరోనా సమయంలో సినీ నటీనటులు వరుసగా పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ ఏడాది ఈ కరోనా సమయంలో యంగ్ హీరో తరుణ్ కూడా పెళ్లి చేసుకోనున్నాడు. తరుణ్ అమ్మ రోజారమణి తనకు చాలా రోజుల నుండి పెళ్లి సంబంధాలు వెతుకుతుంది.

దీంతో తాజాగా అమ్మాయి దొరికిందని వార్తలు రాగా.తనకు తెలిసిన స్నేహితురాలి కూతుర్ని తరుణ్ తో పెళ్లి జరిపించాలని నిర్ణయించుకుందట.

ఇక ఈ విషయం గురించి ఎటువంటి ప్రకటనలు పూర్తిగా లేకపోగా.మొత్తానికి తరుణ్ పెళ్లి చేసుకొనున్నాడని అర్థమవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube