సునీల్‌ ‘మలుపు’  

కమెడియన్‌ నుండి హీరోగా మారిన సునీల్‌ ‘భీమవరం బుల్లోడు’ చిత్రం తర్వాత మరో చిత్రాన్ని తీసుకు వచ్చింది లేదు. చాలా కాలంగా ఈయన సినిమాల గురించి మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి కాని ఒక్క సినిమా కూడా ప్రారంభం అయ్యింది లేదు, ప్రేక్షకుల ముందుకు వచ్చింది లేదు. ప్రస్తుతం ఈయన చేతిలో దిల్‌రాజు నిర్మిస్తున్న చిత్రంతో పాటు గోపీ మోహన్‌ దర్శకత్వంలో కూడా ఈయన నటించబోతున్నాడు. ఇక దిల్‌రాజు నిర్మాణంలో సునీల్‌ హీరోగా నటించబోతున్న చిత్రానికి వాసు వర్మ దర్శకత్వం వహించబోతున్నాడు.

ఇటీవలే చిత్రీకరణ ప్రారంభం అయిన ఈ సినిమాకు తాజాగా ‘మలుపు’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాను వేసవి చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా నిర్మాత దిల్‌రాజు ప్రయత్నాలు చేస్తున్నాడు. సునీల్‌ హీరోగా నటించిన ‘మర్యాద రామన్న’ ఎంత పెద్ద సక్సెస్‌ అయ్యింది ఈ ‘మలుపు’ కూడా అంతే పెద్ద సక్సెస్‌ అవుతుందని చిత్ర యూనిట్‌ సభ్యులు అంటున్నారు. సునీల్‌ కెరీర్‌లో ఈ చిత్రం ఒక ‘మలుపు’గా ఉండి తీరుతుందని దర్శకుడు వాసు వర్మ చెప్పుకొచ్చాడు.