తన కోపాన్ని పరిచయం చేసిన సునీల్  

ఆడియన్స్ పై తన కోపాన్ని చూపించిన సునీల్. .

Actor Sunil Counters On Telugu Audience-chitralahari Movie,counters On Telugu Audience,tollywood

కమెడియన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ కాలంలోనే స్టార్ కమెడియన్ గా ఎదిగి తరువాత హీరోగా టర్న్ తీసుకొని తనదైన ముద్ర వేసిన నటుడు సునీల్. కెరియర్ ఆరంభంలో ఏకంగా హ్యాట్రిక్ విజయాలు అందుకున్న సునీల్ తరువాత వరుసగా ఫ్లాప్ లని తన ఖాతాలో వేసుకున్నాడు. స్టొరీ సెలక్షన్ లో జరిగే పొరపాట్లు వలన అతని సినిమాలు థియేటర్ లో డివైడ్ టాక్ తెచ్చుకున్నాయి..

తన కోపాన్ని పరిచయం చేసిన సునీల్-Actor Sunil Counters On Telugu Audience

ఇక హీరో అయ్యాక సునీల్ లో ఒకప్పటి కామెడి టైమింగ్ కనిపించకపోవడంతో ఆడియన్స్ అతనికి కనెక్ట్ కాలేకపోయారు. అలాగే అతనిని యాక్షన్ హీరోగా ఒప్పుకోలేకపోయారు. దీంతో వరుస ఫ్లాప్ ల తర్వాత మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్ గా టర్న్ తీసుకున్న\ సునీల్ పెద్ద సినిమాలలో ఛాన్స్ లు సొంతం చేసుకున్నాడు.

అయితే వాటిలో తన పాత్ర ప్రేక్షకులకి అంతగా కనెక్ట్ కాలేదు.

అయితే చిత్రలహరి సినిమా ద్వారా కొంత వరకు మళ్ళీ పాత సునీల్ ప్రేక్షకులకి కనిపించాడు. తాజాగా ఇన్ని రోజులు తాను పడిన మానసిక వేదన, ఆడియన్స్ మీద కోపాన్ని ప్రస్తుతం చిత్రలహరి ప్రమోషన్ లో మీడియా ద్వారా చూపిస్తున్నాడని టాక్ వినిపిస్తుంది. ఆడియన్స్ తనని హీరోగా ఎందుకు ఒప్పుకోలేదు.

అలాగే కమెడియన్ అంటే మన ఆడియన్స్ ద్రుష్టిలో ఎలా ఉండాలి అనే విషయాలపై వ్యంగ్యంగా సమాధానాలు ఇచ్చి తన కోపాన్ని చూపించుకున్నాడని తెలుస్తుంది.