పెళ్లి వేడుకలో సందడి చేస్తున్న సుమంత్ అశ్విన్

టాలీవుడ్ లో గత ఏడాది చాలా మంది నటులు పెళ్లి పీటలు ఎక్కి కొత్త జీవితం స్టార్ట్ చేశాడు. కరోనా సమయంలో సెలబ్రేషన్స్ కి దూరంగా కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే పెళ్లితంతు పూర్తి చేసేసుకున్నారు.

 Actor Sumanth Ashwin To Marry Deepika, Tollywood, Telugu Cinema, Ms Raju, Tollyw-TeluguStop.com

ఇలా గత ఏడాది పెళ్లి చేసుకొని జంటగా మారిన వారిలో హీరో నితిన్, రానా, నిఖిల్, నిహారికా ఉన్నారు.వీరితో పాటు కొంత మంది చిన్న నటులు కూడా గత ఏడాది పెళ్లి చేసుకున్నారు.

ఇదిలా ఉంటే ఈ ఏడాది కూడా మన టాలీవుడ్ యువ హీరోలు వరుసగా పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నట్లు కనిపిస్తుంది.ఇక లైన్ లో ముందుగా టాలీవుడ్ బడా నిర్మాత ఏంఎస్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్ వచ్చి చేరాడు.

ఈ నెలలోనే అతను పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు.అతని పెళ్ళికి సంబందించిన సంబరాలు ఇప్పటికే ఇంట్లో మొదలు పెట్టేశారు.

బంధువుల అమ్మాయినే ఏంఎస్ రాజు తన కోడలుగా తెచ్చుకుంటున్నారు.

ఇదిలా ఉంటే హైదరాబాద్కు చెందిన దీపిక అనే అమ్మాయిని సుమంత్ మనువాడుతున్నాడు.

వీరి వివాహం ఈ నెల ఫిబ్రవరి 13న అంటే శనివారం హైదరాబాద్లోని వారి ఫామౌజ్ లో జరగనుంది.వాలంటైన్స్ డే సమయంలో సుమంత్ పెళ్లి చేసుకోబోతుండటం విశేషం సుమంత్ పెళ్లి వేడుక పరిమిత సంఖ్యలో బంధుమిత్రుల సమక్షంలో జరగనుంది.

అయితే పెళ్లి వేడుకలు దగ్గర పడుతున్న కొద్దీ పెళ్లికొడుకు పెళ్లికూతురు ముఖాలలో సిగ్గు వెలిగిపోతుంది.తాజాగా జరిగిన హల్దీ వేడుకలు చూస్తే అర్ధమవుతుంది.ప్రస్తుతం సోషల్ మీడియాలో సుమంత్ హల్దీ సెలెబ్రేషన్స్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.ఫోటోలలో ఇద్దరూ సుమంత్ దీపిక సాంప్రదాయ దుస్తులలో మెరిసిపోతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube