చంద్రబాబు మాట మార్చారు..టాలీవుడ్ హీరో షాకింగ్ కామెంట్స్   Actor Suman Shocking Comments On Chandrababu     2018-04-05   00:53:16  IST  Bhanu C

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక పక్క ప్రత్యేక హోదా ,విభజన హామీల సాధన కోసం పోరాడుతూ ఢిల్లీ గల్లీల్లో తిరుగుతూ ఏపీ రాష్ట్రానికి ఇతర రాష్ట్రాల మద్దతు కూడగట్టుకుంటూ ఫుల్ బిజీ గా ఉన్నారు..మరో పక్క వైసీపి నేతలు సైతం ఢిల్లీ లోనే రాజకీయాలు చేస్తూ అక్కడే తిష్ట వేశారు..ఇలా ఎవరికీ వారు ఎవరి స్టైల్ లో ఫుల్ బిజీ అయిపోయారు..ఇదిలాఉంటే టాలీవుడ్ హీరో నటుడు సుమన్ చంద్రబాబు పై టిడిపి పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు..అయితే ఈ వ్యాఖ్యల వెనుకాల టిడిపి ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ టాలీవుడ్ పై చేసిన వాటికి రివేంజ్ గా చేశారా లేక సుమన్ వ్యక్తిగతంగా చేశారా అనే విషయం పక్కన పెడితే..సుమన్ మాత్రం చంద్రబాబు కి సూటి ప్రశ్నలు సంధించారు…


ఇటీవల కాలంలో సుమన్ రాజకీయ విషయాలపై ఎక్కువగా మాట్లాడుతున్నారు..అంతేకాదు చాలా ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు..గతంలో కేసీఆర్ పాలన ఎంతో అద్భుతంగా ఉంది హైదరాబాదు ని కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారు అంటూ పొగడ్తలలో ముంచెత్తిన సుమన్ కేసీఆర్ కి నా పూర్తి మద్దతు ఉంటుంది అంటూ మీడియా ముందు చెప్పారు కానీ ఆసమయంలో అసలు హైదరాబాద్ ఆ స్థాయిలో అభివృద్ధి చెందటానికి పునాదులు వేసిన చంద్రబాబు ఊసే ఎత్తలేదు..ఇది పక్కన పెడితే తాజాగా హీరో సుమన్ చంద్రబాబు పై షాకింగ్ కామెంట్స్ చేశారు..

ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై తాజాగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వడం వల్ల ఏపీకి కలిగే ప్రయోజనాలేంటో?.. ప్రజలకి సీఎం చంద్రబాబు వివరించాలన్నారు..అసలు మనకి వాటి వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో కూడా తెలియకపోతే ఎలా అంటూ కామెంట్స్ చేశారు..గతంలో ఇదే చంద్రబాబు స్వయంగా ఏపీకి ప్రత్యేక హోదా వద్దు స్పెషల్ ప్యాకేజీ మాత్రం సరిపోతుంది అని చెప్పారు కానీ ఇప్పుడు రివర్స్ గేర్ వేసి ప్రత్యేక హోదా కావాలి అంటున్నారు ఇది ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు..ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఉద్యమానికి తన మద్దతు ఉంటుందని తెలిపారు.చంద్రబాబు అప్పట్లో హోదా వద్దు.. స్పెషల్ ప్యాకేజీనే కావాలన్నారు. ఇప్పుడు హోదానే ముఖ్యమంటున్నారు. అసలు హోదా వల్ల రాష్ట్రానికి కలిగే ప్రయోజనాలేంటో ప్రజలకి తెలియజేస్తే కదా వారికి ఏమి కావాలో ఏమి వద్దో తెలిసేది అంటూ విమర్శించారు…సుమన్ ఈ తరహా వ్యాఖ్యలు వెనుకాల టాలీవుడ్ పెద్దల ప్రమేయం ఉందేమో అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు టిడిపి నేతలు..ఏది ఏమినా సరే సుమన్ రాజేసిన ఈ మంట ఎంత దూరం వెళ్తుందో వేచి చూడాలి..