దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు లోకలే.. మా ఎన్నికలపై సుమన్ రియాక్షన్..!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల వేడి టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.ఐదుగురు సభ్యులు మా అధ్యక్ష పదవికి పోటీ పడుతుండగా ప్రత్యర్ధులపై విమర్శలు చేస్తున్నారు.

 Suman Reaction About Local Non Local Maa Elections, Actor Suman, Maa Elections,-TeluguStop.com

ఇక ఈసారి ప్రత్యేకంగా లోకల్ నాన్ లోకల్ అన్న మాట బాగా వినిపిస్తుంది.నాన్ లోకల్ అయిన ప్రకాష్ రాజ్ అధ్యక్ష పదవికి పోటీ చేయడం కొందరికి నచ్చట్లేదు.

ఈ విషయంపై పెద్ద చర్చే జరుగుతుందని చెప్పొచ్చు.

అయితే ఈ క్రమంలో సీనియర్ హీరో సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు లోకలేనని అన్నారు.వైద్యులు, రైతులు తాము నాన్ లోకల్ అనుకుంటే జనాలకు వైద్య చికిత్స, ఆహారం కూడా అందదని ఆయన అన్నారు.

పరోక్షంగా ప్రకాష్ రాజ్ కు సుమన్ మద్ధతు ప్రకటించారు.జాతీయ వైద్య దినోత్సవం సనర్భంగా హైదరాబాద్ అమీర్ పేట లో అస్టర్ ప్రైం హాస్పిటల్ లో కార్యక్రమానికి వచ్చిన సుమన్ కరోనా టైం లో వైద్యులు చేసిన సేవలు చాలా గొప్పవని అన్నారు.

ఈ సందర్భంగా మా ఎన్నికల గురించి ఆయన స్పందించారు.అందరు కలిసికట్టుగా ఉండాలని లోకల్, నాన్ లోకల్ అనే ఫీలింగ్ వద్దని ఆయన అన్నారు.

ప్రకాష్ రాజ్ కు వ్యతిరేకంగా నాన్ లోకల్ కార్డ్ వాడుతున్నారు కొందరు వ్యక్తులు.ఇంకా ఎన్నికలకు రెండు నెలలు టైం ఉండగా ఇప్పటినుండే మా ఎన్నికల రగడ మొదలైందని చెప్పాలి.

ప్రకాష్ రాజ్ తరపున ప్యానెల్ ప్రకటించగా మిగతా సభ్యులు కూడా ఆ పనిలో ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube