కన్నడ లోక్ సభ ఎన్నికలలో దూసుకుపోతున్న తెలుగు హీరోయిన్  

కర్ణాటక ముఖ్యమంత్రికి చుక్కలు చూపిస్తున్న సుమలత. .

Actor Sumalatha Speed Up In Karnataka Lok Sabha Election-bjp,congress,jds,karnataka,kumaraswami,lok Sabha Election

ఇప్పుడు దేశం వ్యాప్తంగా ఎన్నికల ఫీవర్ ఉంది. ఓ వైపు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ ప్రధాన పార్టీలు నువ్వా నేనా అన్నట్లు ఎన్నికల రణరంగంలో దూసుకుపోతున్నాయి..

కన్నడ లోక్ సభ ఎన్నికలలో దూసుకుపోతున్న తెలుగు హీరోయిన్ -Actor Sumalatha Speed Up In Karnataka Lok Sabha Election

ఇక్కడి వరకు ఇదంతా భాగానే ఉంది. మరో వైపు మన పక్కనే ఉన్న కర్ణాటక ఎన్నికలలో మండ్యా నియోజక వర్గం నుంచి తెలుగు ఆడపడుచు, ఒకప్పటి స్టార్ హీరోయిన్ సుమలత ఎంపీగా బరిలో నిలబడుతుంది. అంబరీష్ భార్యగా మండ్యా వాసులకి భాగాఈ దగ్గరైన నటి సుమలత.

అయితే అంబరీష్ చనిపోయిన తర్వాత సుమలతకి అతని రాజకీయ వారసత్వం తీసుకొని రాజకీయాలలోకి వచ్చింది.

అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న కుమారస్వామి కొడుకు హీరో నిఖిల్ ఎంపీ అభ్యర్ధిగా బరిలో నిలబడ్డాడు. తన కొడుకుని గెలుపించుకోవడానికి కుమారస్వామి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

కాని స్వతంత్ర్య అభ్యర్ధిగా బరిలో ఉన్న సుమలతకి ఓ వైపు కాంగ్రెస్, మరో వైపు బీజేపీ కూడా తమ అభ్యర్ధిని పొటీలో దించకుండా మద్దతు ప్రకటించాయి. దాంతో పాటు కన్నడ స్టార్ హీరోలైన యష్, దర్శన్ కూడా సుమలతకి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

ఇదిలా ఉంటే మరో వైపు సుమలత ఎన్నికల ప్రచారంలో కూడా తనదైన శైలిలో దూసుకుపోతుంది. అధికార పార్టీ, ముఖ్యమంత్రి కుమారస్వామి మీద విమర్శలు చేస్తూ తనదైన శైలిలో ప్రజలని, మహిళలని ఎక్కువగా ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది.

దీంతో మండ్యా ప్రజలందరూ ఇప్పుడు సుమలత వైపు మొగ్గు చూపిస్తున్నారు. అయితే ఎలా అయిన సుమలత గెలుపుని అడ్డుకోవాలని ముఖ్యమంత్రి కుమారస్వామి కుట్ర రాజకీయాలకి తెర తీస్తున్నట్లు తెలుస్తుంది.