30,000 కోసం కక్కుర్తి పడి ఆ మూవీలో నటించా.. నటుడి షాకింగ్ కామెంట్స్!

తననేవరైనా ఒకవేళ పొరపాటున ఏమన్నా అన్నా కూడా వాళ్ళు కావాలని అలా అనరని తనకు తెలుసు అని ప్రముఖ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ అన్నారు.ఎవరూ ఎవరినీ కావాలని ఏమీ అనరని వాళ్ల వృత్తి రిత్యా వాళ్ళ పనుల్లో ఒత్తిడి వల్ల మేనేజ్ చేయలేక అలా చేస్తారని ఆయన అన్నారు.

 Actor Srikanth Iyengar Shocking-TeluguStop.com

కానీ కొందరు మాత్రం కావాలనే వేరే వాళ్ళతో పెట్టుకుంటారని ఆయన తెలిపారు.మామూలుగా అయితే అసలు సినిమా ఫీల్డ్ లో అలా ఉండదని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా ఆయన ప్రొఫెషనల్ యాక్టర్ అంటే ఎలా ఉండాలి అనే దానిపైన చర్చించారు.అసలు ప్రొఫెషనల్ యాక్టర్ అంటే.ఎమోషన్స్ కంట్రోల్ చేస్కోవాలి అందరితో మంచిగా ఉండాలని శ్రీకాంత్ అయ్యంగార్ వివరించారు.తన కుటుంబ సభ్యులు, ఇంకెవరైనా లేకపోయినా ఉంటానేమో గానీ.

 Actor Srikanth Iyengar Shocking-30,000 కోసం కక్కుర్తి పడి ఆ మూవీలో నటించా.. నటుడి షాకింగ్ కామెంట్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సినిమా లేకుండా షూటింగ్స్ లేకుండా అస్సలు ఉండలేనని ఆయన చెప్పారు.డేట్స్, డబ్బులు మ్యాచ్ అయితే తాను సినిమాల్లో ఏ క్యారెక్టర్ చేయడానికైనా రెఢీ అని ఆయన చెప్పారు.

ఒకానొక సమయంలో కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కేవలం 30 వేల రూపాయల కోసం ఓ సినిమా చేసి తప్పు చేశానని ఆయన అన్నారు.ఆ తర్వాత ఆరు నెలలకు దర్శకుడు మారుతి కాల్ చేసి మజిలీ సినిమాలో బాగా చేశారు, దాన్ని చూసి మీకు ప్రతిరోజూ పండగే సినిమాలో ఛాన్స్ ఇస్తున్నానని చెప్పారని ఆయన వెల్లడించారు.దాన్ని బట్టి ఏం నేర్చుకున్న అంటే తలుపు తట్టి ఒక అవకాశం వస్తే సాష్టాంగ నమస్కారం చేసి అది చేసి తీరాలి.అది ఏ పాత్రైనా,ఏ సినిమా అయినా,అని శ్రీకాంత్ అయ్యంగార్ వివరించారు.

#Majili #Maruthi #PrathiRaoju

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు