'ఎన్టీఆర్‌'లో రాజశేఖర్‌ రెడ్డి... 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌'లో చంద్రబాబు నాయుడు.. ఇతడికి అరుదైన అవకాశం  

  • ఎన్టీఆర్‌ బయోపిక్‌లు ప్రస్తుతం రెండు వస్తున్నాయి. వాటిలో ఒకటి బాలకృష్ణ ‘ఎన్టీఆర్‌’ కాగా, రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’. ఈ రెండు సినిమాలు కూడా ప్రేక్షకుల దృష్టిని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ రెండు చిత్రాలు కూడా నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి. కొందరు వర్మ ఎన్టీఆర్‌ కోసం అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కారణం ఎన్టీఆర్‌ జీవితంలోని చీకటి కోణాన్ని ఆయన ఆవిష్కరిస్తున్నాడు. చంద్రబాబు నాయుడును వర్మ విలన్‌గా చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది.

  • Actor Sri Tej In Two Different Roles NTR Biopic And Lakshmi's NTR-Chandrababu Naidu Carrector Laxmis Ntr Laxmis Movie Rajasekar Reddy Role Bio Pic Rgv Next

    Actor Sri Tej In Two Different Roles In NTR Biopic And Lakshmi's NTR

  • ఎన్టీఆర్‌కు సంబంధించిన రెండు బయోపిక్‌లలో కూడా ఒక వ్యక్తి నటిస్తున్నాడు. ఆ వ్యక్తి చాలా అరుదైన రికార్డును దక్కించుకున్నాడు. బాలకృష్ణ ‘ఎన్టీఆర్‌’ మూవీలో రాజశేఖర్‌ రెడ్డి పాత్రను పోషించిన శ్రీతేజ్‌ కథానాయకుడులో కొద్ది సమయం కనిపించాడు. బాలకృష్ణకు రానా పరిచయం చేసే సీన్‌లో శ్రీతేజ్‌ కనిపించాడు. రాజశేఖర్‌ రెడ్డి పాత్రను పోషించిన శ్రీతేజ్‌ ఇప్పుడు వర్మ సినిమాలో చంద్రబాబు నాయుడు పాత్రను పోషించడం చర్చనీయాంశం అవుతుంది.

  • Actor Sri Tej In Two Different Roles NTR Biopic And Lakshmi's NTR-Chandrababu Naidu Carrector Laxmis Ntr Laxmis Movie Rajasekar Reddy Role Bio Pic Rgv Next
  • తాజాగా శ్రీతేజ్‌ను చంద్రబాబు నాయుడు పాత్రలో చూపుతూ వర్మ ఫస్ట్‌లుక్‌ విడుదల చేశాడు. అయితే గతంలో ఒక హోటల్‌లోని సర్వర్‌ను చంద్రబాబు నాయుడు పాత్ర కోసం తీసుకుంటానంటూ వర్మ హఢావుడి చేశాడు. అచ్చు అతుడు చంద్రబాబు నాయుడులా ఉన్నాడని, తప్పకుండా అతడిని తీసుకుంటాను అంటూ చెప్పుకొచ్చాడు. కాని చివరికు శ్రీతేజ్‌ను చంద్రబాబు పాత్రకు తీసుకున్నాడు. ఈ చిత్రంతో వర్మ సంచలనానికి తెర లేపడం ఖాయం అంటున్నారు.