ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన శ్రీవిష్ణు.. యాక్టింగ్ కింగ్ అంటూ?

యంగ్ హీరో శ్రీవిష్ణు ఈరోజు రాజరాజచోర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రాగా క్రిటిక్స్ నుంచి ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి.

 Actor Sreevishnu Interesting Comments About Ntr, Tollywood , Sreevishnu , Commen-TeluguStop.com

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ నటనకు వీరాభిమానులు ఉన్నారు.తాజాగా నెటిజన్లతో ముచ్చటించిన శ్రీవిష్ణు యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఎన్టీఆర్ గురించి వన్ వర్డ్ చెప్పాలని కోరగా యాక్టింగ్ కింగ్ అని శ్రీవిష్ణు చెప్పుకొచ్చారు.యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై ఉన్న అభిమానాన్ని శ్రీవిష్ణు ఈ విధంగా చాటుకున్నారు.

శ్రీవిష్ణు రిప్లైతో తారక్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.ఎంటర్టైన్మెంట్ కు ప్రాధాన్యత ఉండే చిత్రాలను ఎంచుకుంటున్న శ్రీవిష్ణు రాజ రాజ చోర సినిమాను సైతం అదే విధంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Telugu Middle Range, Sree Vishnu, Tollywood-Movie

శ్రీవిష్ణు సినిమాలో తొలిసారి ఇద్దరు హీరోయిన్లు నటించగా ఈ సినిమా రీమేక్ హక్కులను ఇతర భాషల వాళ్లు అడుగుతారంటూ శ్రీవిష్ణు చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.అభిషేక్ అగర్వాల్ తో పాటు టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించారు.శ్రీవిష్ణుకు రోజురోజుకు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతుండగా యువతను శ్రీవిష్ణు ఎంచుకుంటున్న కథలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

Telugu Middle Range, Sree Vishnu, Tollywood-Movie

వరుసగా రెండు ఫ్లాపులతో డీలా పడిన శ్రీవిష్ణు ఖాతాలో రాజ రాజ చోర సినిమాతో మరో సక్సెస్ చేరింది.మరోవైపు శ్రీవిష్ణు వేగంగా సినిమాల్లో నటిస్తూ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు.శ్రీవిష్ణు తరువాత సినిమాలు కూడా హిట్టైతే మిడిల్ రేంజ్ హీరోలుగా శ్రీవిష్ణు కెరీర్ ను కొనసాగించే అవకాశాలు ఉంటాయి.

శ్రీవిష్ణు కొత్త తరహా కథలను ఎంచుకుంటూనే కథలో ఎంటర్టైన్మెంట్ ఉండేలా జాగ్రత్త పడితే మంచిదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube