విలన్ రోల్స్ కు సోనూసూద్ గుడ్ బై.. ఎందుకంటే..?

కెరీర్ మొదట్లో చిన్నచిన్న పాత్రల్లో నటించిన సోనూసూద్ తెలుగులో సూపర్, అతడు, అరుంధతి, దూకుడు, జులాయి, ఆగడు సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు.స్టైలిష్ విలన్ గా పేరు తెచ్చుకున్న సోనూసూద్ విలన్ గా నటించిన సినిమాల్లో మెజారిటీ సినిమాలు హిట్లు కావడం గమనార్హం.

 Actor Sonusood Says Good Bye To Villain  Roles, Super, Arundhati,, Athadu, Julay-TeluguStop.com

అయితే ప్రేక్షకుల దృష్టిలో విలన్ గా గుర్తింపు తెచ్చుకున్న సోనూసూద్ లాక్ డౌన్ సమయంలో మాత్రం హీరో అయ్యాడు.

దేశంలో కష్టాలు పడుతున్న వందల మందికి సోనూసూద్ సాయం చేశారు.

ఇప్పటికీ ఆ సహాయాలను సోనూసూద్ కొనసాగిస్తున్నాడు.ఆస్తులను తనఖా పెట్టి మరీ సోనూసూద్ ఇతరులకు సాయం చేస్తూ ఉండటాన్ని రాజకీయ, సినీ ప్రముఖులు సైతం ప్రశంసిస్తున్నారు.

ఒకప్పుడు విలన్ ఇమేజ్ ఉన్న సోనూసూద్ ను దేశంలోని ప్రజలు రియల్ హీరోగా భావిస్తున్నారు.దీంతో సోనూసూద్ సైతం విలన్ పాత్రలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

Telugu Acharya, Sonusood, Bye Villain, Koratala Shiva-Movie

మరోవైపు దర్శకులు సైతం తమ సినిమాల్లో సోనూసూద్ పాత్ర పరిధిని పెంచేందుకు స్క్రిప్ట్ లో మార్పులు చేస్తున్నారని తెలుస్తోంది.దర్శకులు సైతం సోనూసూద్ ను పాజిటివ్ గానే చూపించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.సోనూసూద్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పాజిటివ్ పాత్రల్లోనే తాను ఎక్కువగా నటిస్తానని వచ్చే ఏడాది వీలైనన్ని ఎక్కువ సినిమాల్లో నటించే ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు.

సోనూసూద్ అభిమానులు సోనూ చేస్తున్న సేవలకు గాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పురస్కారాలతో సత్కరిస్తే బాగుంటుందని చెబుతున్నారు.

ప్రస్తుతం సోనూసూద్ తెలుగులో ఆచార్య సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నాడు.భవిష్యత్తులో సోనూసూద్ హీరోగా కూడా నటించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.సోనూసూద్ సినిమాల ద్వారా సంపాదించే ఆదాయంతో పాటు తన వ్యాపారాల ద్వారా వచ్చే ఆదాయాన్ని సహాయల కోసం ఖర్చు చేస్తున్నారు.సోనూసూద్ కు అతని స్నేహితులలో కొంతమంది సహాయ కార్యక్రమాలు చేయడానికి సహకారం అందిస్తున్నారని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube