ట్రోలర్స్ కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన సోనూసూద్!  

Actror Sonu Sood on Trollers, Sonu Sood, Trolls, Netizens, Social Media, Help, Sonu Sood Counter, Story - Telugu Actror Sonu Sood On Trollers, Help, Netizens, Social Media, Sonu Sood, Sonu Sood Counter, Sonusood Response, Tollywood Villain, Trollers, Trolls

కరోనా, లాక్ డౌన్ వల్ల సామాన్య, మధ్య తరగతి వర్గాల ప్రజలు పడిన ఇబ్బందులు అన్నీఇన్నీ కావు.దేశంలో కరోనా కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోవడానికి కారణమైంది.

TeluguStop.com - Actor Sonusood Responded Trolls He Fraud

వలస కార్మికులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.ఇలా చెప్పుకుంటూ పోతే దేశంలో ఈ రంగం, ఆ రంగం అనే తేడాల్లేకుండా అన్ని రంగాలపై మహమ్మారి తీవ్ర ప్రభావం చూపింది.

కరోనా కష్ట కాలంలో కోట్లల్లో పారితోషికం తీసుకునే స్టార్ హీరోలు సహాయం చేయడానికి ముందుకు రాకపోయినా సోనూసూద్ మాత్రం తన వంతు సహాయం చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.
సినిమాల్లో విలన్ గా పేరు తెచ్చుకున్న సోనూ రియల్ లైఫ్ లో మాత్రం హీరోగా ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నారు.

TeluguStop.com - ట్రోలర్స్ కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన సోనూసూద్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి నేటి వరకు పేదలకు, వలస జీవులకు, విద్యార్థులకు, రైతులకు సహాయం చేస్తూ గొప్ప మనస్సును చాటుకున్నారు.అయితే అందరికీ సహాయం చేస్తున్న సోనూను ప్రజలంతా ప్రశంసిస్తున్నా కొందరు మాత్రం సోనూను టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.

చాలా రోజుల నుంచి ట్రోల్స్ విషయంలో మౌనంగా ఉన్న సోనూసూద్ తాజాగా స్పందించి ట్రోలర్స్ కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు.ఒక టీవీ షోకు హాజరైన సోనూ తాను చిన్నప్పుడు విన్న కథ గురించి చెప్పారు.“ఒక సాధువు దగ్గర అద్భుతమైన గుర్రం ఉండేదని.ఒక బందిపోటు సాధువును గుర్రం తనకు ఇవ్వాలని కోరినా సాధువు ఇవ్వలేదని.

ఆ తరువాత సాధువు నడవలేని స్థితిలో వెళుతున్న వృద్ధుడిని చూసి గుర్రాన్ని ఇచ్చాడని.ఆ వృద్ధుడు గుర్రంపై ఎక్కిన తరువాత తాను బందిపోటునని చెప్పాడని.

ఆ తరువాత సాధువు గుర్రంపై వెళుతున్న బందిపోటును ఆపి గుర్రాన్ని తీసుకువెళ్లినా పరవాలేదని.అయితే గుర్రాన్ని ఎలా ఇచ్చాననే విషయం మాత్రం చెప్పొద్దని కోరాడని.

బందిపోటు ఎందుకు అని సాధువును ప్రశ్నించగా ప్రజలు ఎప్పుడూ మంచి పని చేసేవారిని నమ్మరు” అని చెప్పాడని ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చారు.
ట్రోల్స్ తనను ప్రభావితం చేయవని తాను చేయాలనుకున్నది ఖచ్చితంగా చేసి తీరతానని సోనూ అన్నారు.

ఎవరికీ ఊరికే సాయం చేయలేదని సాయం చేసిన వారి పూర్తి వివరాలు ఉన్నాయని చెప్పారు.తనపై విమర్శలు చేసే బదులు ఇతరులకు సాయం చేస్తే మంచిదని తాను కోరుకుంటున్నానని చెప్పారు.

#Help #ActrorSonu #Sonu Sood #Trollers #Social Media

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Actor Sonusood Responded Trolls He Fraud Related Telugu News,Photos/Pics,Images..