కోటి రూపాయలు ఇవ్వాలని అడిగిన అభిమాని.. సోనూసూద్ ఏమన్నారంటే?

Real Hero Sonusood Interesting Comments About Netizen Question, One Crore, Congress Party, Interesting Facts, Sonusood Tweet, Netizens Question, Mumbai Elections, Aacharya Movie, Tollywood,

సోషల్ మీడియాను సరైన విధంగా వినియోగించుకుంటే ఎన్నో లాభాలు ఉంటాయనే సంగతి తెలిసిందే.కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సమయంలో సోషల్ మీడియా ద్వారా కష్టాల్లో ఉన్న ప్రజల సమస్యలను తెలుసుకోవడంతో పాటు సోనూసూద్ ఆ సమస్యలను వేగంగా పరిష్కరించి వార్తల్లో నిలిచారు.

 Real Hero Sonusood Interesting Comments About Netizen Question, One Crore, Congr-TeluguStop.com

దేశమంతటా సోనూసూద్ కు కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు.ఏ సమస్య వచ్చినా సోషల్ మీడియా ద్వారా నెటిజన్లు సహాయం కోరుతున్నారు.

సోషల్ మీడియాలో నెటిజన్లు అడిగే ప్రశ్నలకు సైతం సోనూసూద్ తనదైన శైలిలో జవాబులు ఇస్తారు.తాజాగా ఒక నెటిజన్ సోనూసూద్ ను సోనూసూద్ సార్, కోటి రూపాయలు నాకు కావాలని అడిగాడు.

అయితే నెటిజన్ ప్రశ్నకు సోనూసూద్ జవాబు ఇస్తూ కేవలం కోటి రూపాయలు మాత్రమే సరిపోతాయా ఎక్కువ మొత్తం అడగండి అని కోరారు.సోనూసూద్ చేసిన ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.

మరోవైపు సోనూసూద్ మహారాష్ట్రలోని ముంబైలో జరిగే ఎన్నికల్లో పోటీ చేస్తారని ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది.

కాంగ్రెస్ పార్టీ సోనూసూద్ పేరును పరిశీలిస్తోందని వార్త ప్రచారంలోకి రాగా సోనూసూద్ ఆ వార్త గురించి స్పందించి స్పష్టతనిచ్చారు.తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు వైరల్ అయిన వార్తలో నిజం లేదని సోనూసూద్ కామెంట్లు చేశారు.నటుడిగా మాత్రమే ఉండాలని కోరుకుంటున్నానని సోనూసూద్ చెప్పుకొచ్చారు.

నటుడిగా మాత్రమే ప్రజలకు సహాయం చేయాలని తాను భావిస్తున్నానని సోనూసూద్ తెలిపారు.తాను ముంబైకు వచ్చిన కలలు ఇంకా నెరవేరలేదని ఆ కలలు నెరవేరాల్సి ఉందని సోనూసూద్ కామెంట్లు చేశారు.సోనూసూద్ తెలుగులో నటించిన ఆచార్య సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా మరికొన్ని సినిమాల రిలీజ్ డేట్లకు సంబంధించిన ప్రకటనలు వెలువడాల్సి ఉంది.సోనూసూద్ ను అభిమానించే అభిమానుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube