కొత్త ఇంటిని కొనుగోలు చేసిన సోనూసూద్.. ఎన్ని కోట్లంటే..?

రియల్ హీరో సోనూసూద్ నిత్యం తను చేస్తున్న మంచి పనుల ద్వారా వార్తల్లో నిలవడంతో పాటు పేద ప్రజలకు సహాయం చేయడం కొరకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న సంగతి తెలిసిందే.తన దాతృత్వంతో సోనూసూద్ రియల్ హీరోగా పేరును సంపాదించుకుని తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.

 Actor Sonusood Buys New Lavish House In Hyderabad-TeluguStop.com

విలన్ పాత్రల ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన సోనూసూద్ హైదరాబాద్ లో ఒక ఇల్లు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

టాలీవుడ్ సినిమాలలో ఎక్కువ సినిమాల షూటింగ్ లు హైదరాబాద్ లో జరుగుతాయనే సంగతి తెలిసిందే.

 Actor Sonusood Buys New Lavish House In Hyderabad-కొత్త ఇంటిని కొనుగోలు చేసిన సోనూసూద్.. ఎన్ని కోట్లంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తెలుగు సినిమాలలో ఎక్కువగా నటిస్తున్న సోనూసూద్ హైదరాబాద్ లో హోటళ్లలో ఉండటానికి ఎక్కువగా ఆసక్తి చూపేవారు.అయితే ప్రస్తుతం సోనూసూద్ బంజారా హిల్స్ లో కొత్త ఇంటిని కొనుగోలు చేశారని ఈ ఇంటి ఖరీదు ఏకంగా 10 కోట్ల రూపాయలని సమాచారం.

వచ్చే నెలలో సోనూసూద్ కొత్త ఇంటికి మారనున్నారని ప్రచారం జరుగుతోంది.

సామాజిక కార్యక్రమాలు చేస్తున్న సోనూసూద్ తన సేవ కార్యక్రమాల కోసంకూడా ఈ ఇల్లు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.ఈ మధ్య కాలంలో కొంతమంది టాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు ముంబైలో కొత్త ఇల్లును కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే.అయితే సోనూసూద్ మాత్రం వారికి భిన్నంగా హైదరాబాద్ లో కొత్త ఇంటిని కొనుగోలు చేసి వార్తల్లో నిలిచారు.

మరోవైపు సోనూసూద్ నెగిటివ్ పాత్రల్లో నటిస్తే ప్రేక్షకులు అంగీకరించడం లేదు.

సోనూసూద్ ఇకపై ఎలాంటి పాత్రలను ఎంపిక చేసుకుంటారో చూడాల్సి ఉంది.మరోవైపు సోనూసూద్ రెమ్యునరేషన్ ను భారీగా పెంచారని ప్రచారం జరుగుతుండగా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడం వల్లే అఖండ సినిమాలో విలన్ పాత్రలో నటించే అవకాశాన్ని సోనూసూద్ మిస్ చేసుకున్నారని వార్తలు వస్తుండటం గమనార్హం.

#Hyderabad #Akhanda #Sonusood #Corona #Corona Warrior

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు