ఆర్ధిక కష్టాల్లో నటుడు, లాక్ డౌన్ వల్ల పండ్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి  

Lockdown crisis actor turns Fruit seller ,solanki diwakar, actor solanki diwakar selling mangoes, locdown effect - Telugu Actor Solanki Diwakar Selling Mangoes, Locdown Effect, Lockdown Crisis Actor Turns Fruit Seller, Solanki Diwakar

కరోనా మహమ్మారి వల్ల జనాల జీవితాలు మారిపోయాయి.రాజు,పేద అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆర్ధికపరంగా చాలా దెబ్బ తిన్నారు.

TeluguStop.com - Actor Solanki Diwakar Fruit Seller

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

ఎదో గొప్ప గొప్ప నటులు అయితే ఈ మహమ్మారి సృష్టించిన ఆర్ధిక కష్టాలను అయితే తట్టుకోగలుగుతున్నారు కానీ చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసేవారు,అలానే అసిస్టెంట్ లు ఆర్ధిక కష్టాలతో ఇబ్బందులు పడుతున్నారు.ఇక వలస కూలీల పని అయితే మరి చెప్పనక్కరలేదు.

TeluguStop.com - ఆర్ధిక కష్టాల్లో నటుడు, లాక్ డౌన్ వల్ల పండ్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి-General-Telugu-Telugu Tollywood Photo Image

అలాంటి ఆర్ధిక కష్టాలను తట్టుకోలేక బాలీవుడ్ లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసే నటుడు కుటుంబ పోషణ నిమిత్తం మామిడి పండ్లను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
లాక్‌డౌన్‌ నేపథ్యంలో షూటింగ్‌లకు బ్రేక్ పడటంతో చాలా మంది కారెక్టర్ ఆర్టిస్ట్‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ క్రమంలో ఆ మధ్యన ఓ సీరియల్ నటి తన వద్ద డబ్బులు లేకపోతే మేకప్ మ్యాన్ సహాయం చేశారంటూ సోషల్ మీడియాలో తెలిపిన విషయం విదితమే.ఇప్పుడు తాజాగా హిందీలో ‘తిత్లీ’, ‘డ్రీమ్ గర్ల్’, ‘సోంచారియా’, ‘హల్కా’ వంటి చిత్రాల్లో నటించిన సోలంకి దివాకర్(35)‌ అనే నటుడుకి కరోనా నేపథ్యంలో ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి.

ఈ క్రమంలో పండ్ల వ్యాపారిగా మారిపోయారు.అయితే సినిమాల్లోకి వెళ్లకముందు కూడా ఆయన ఇదే వ్యాపారం చేస్తుండగా.ఇప్పుడు కుటుంబ పోషణ కోసం మళ్లీ తన వృత్తిలోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.

”లాక్‌డౌన్‌ కొనసాగుతూ ఉండటంతో నా కుటుంబ పోషణ కష్టమవుతోంది.నేను ఇంటి రెంట్ కట్టాలి.

అలాగే ఇంట్లో అందరినీ చూసుకోవాలి.అందుకే మళ్లీ నా పాత వృత్తిలోకి వచ్చేశా” అని తెలిపారు.

కాగా రిషి కపూర్ పక్కన ఓ సినిమాలో సోలంకి ఆఫర్‌ రాగా ఇటీవల ఆయన ఆకస్మిక మరణంతో ఇప్పుడు ఆ చిత్రం ఆగిపోయినట్లు తెలుస్తుంది.ప్రస్తుతం ఇంకా లాక్ డౌన్ కొనసాగుతుండడం తో ఎప్పుడు షూటింగ్ లు మొదలు పెడతారు అన్న విషయం మాత్రం వెల్లడికావడం లేదు.

#LockdownCrisis #ActorSolanki #Solanki Diwakar #Locdown Effect

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Actor Solanki Diwakar Fruit Seller Related Telugu News,Photos/Pics,Images..