మహా సముద్రం మూవీకి సిద్దార్థ్ రెమ్యునరేషన్ ఎంతంటే..?

ఆర్.ఎక్స్ 100 సినిమాతో తొలి ప్రయత్నంలోనే అజయ్ భూపతి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అని అనిపించుకున్నారు.

 Actor Siddharth Remuneration For Mahasamudram Movie Details Here-TeluguStop.com

తన రెండో సినిమాగా శర్వానంద్, సిద్దార్థ్ లతో మహాసముద్రం అనే సినిమాను అజయ్ భూపతి తెరకెక్కిస్తున్నారు.గత కొన్నేళ్లుగా తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న సిద్దార్థ్ ఈ సినిమాతో తెలుగులోకి రీఎంట్రీ ఇవ్వనుండటం గమనార్హం.

బాయ్స్ మూవీతో నటుడిగా కెరీర్ ను మొదలుపెట్టిన సిద్దార్థ్ నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాతో తెలుగులో సక్సెస్ ను సొంతం చేసుకున్నారు.

 Actor Siddharth Remuneration For Mahasamudram Movie Details Here-మహా సముద్రం మూవీకి సిద్దార్థ్ రెమ్యునరేషన్ ఎంతంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సిద్దార్థ్ హీరోగా తెరకెక్కిన బొమ్మరిల్లు సినిమా సిద్దార్థ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ను భారీగా పెంచింది.

తెలుగులో సిద్దార్థ్ హీరోగా చివరగా ఓ మై ఫ్రెండ్ సినిమాలో నటించగా ఆ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఫ్లాప్ కావడంతో సిద్దార్థ్ ఆ తరువాత తమిళ సినిమాలకే ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చారు.అయితే సిద్దార్థ్ రీఎంట్రీ మూవీ మహాసముద్రం కోసం ఏకంగా రూ.3 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నారని తెలుస్తోంది.

Telugu 3 Crores, Actor Siddarth, Aditi Rao Hyari, Anu Emmanuel, Director Ajay Bhupathi, Mahasamudram Movir, Remuneration Details, Sharwanand, Tollywood-Movie

మహాసముద్రంకు సిద్దార్థ్ పారితోషికం గురించి తెలిసి షాకవ్వడం నెటిజన్ల వంతవుతోంది.ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హిట్ సాధించిన హీరోలు సైతం ఈ స్థాయిలో పారితోషికం తీసుకోవడం లేదు.సిద్దార్థ్ మహాసముద్రం సినిమాతో సక్సెస్ సాధిస్తే టాలీవుడ్ లో మళ్లీ వరుస ఆఫర్లతో బిజీ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు.ఈ సినిమాలో హీరోయిన్లుగా అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

Telugu 3 Crores, Actor Siddarth, Aditi Rao Hyari, Anu Emmanuel, Director Ajay Bhupathi, Mahasamudram Movir, Remuneration Details, Sharwanand, Tollywood-Movie

ఈ ఏడాదే మహాసముద్రం రిలీజ్ కానుంది.మొదట ఆగష్టు 19వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుందని ప్రకటన వెలువడగా ఆ తేదీకి ఈ సినిమా రిలీజ్ కావడం కష్టమేనని సమాచారం.ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేని శర్వానంద్ ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు.

#Aditi Rao Hyari #Actor Siddarth #Anu Emmanuel #Sharwanand #DirectorAjay

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు