Hero Siddharth: జూనియర్ ఆర్టిస్ట్ గా నటించిన ఈ స్టార్ హీరోను గుర్తు పట్టారా ?

హీరో సిద్ధార్థ్.ఇప్పుడు అయితే రకరకాల రూమర్స్ తో వార్తల్లో కనిపిస్తున్నాడు కానీ కెరీర్ తొలినాళ్లలో చాలా ఫ్యాషనేట్ గా ఉండేవాడు.2003 లో తొలిసారి బాయ్స్ సినిమాతో తమిళం లో హీరో గా పరిచయం అయ్యాడు.ఈ సినిమా ఇదే పేరుతో తెలుగులో కూడా డబ్ అయ్యింది.

 Hero Siddharth Movie As Junior Artist Details, Siddharth, Hero Sidhharth, Siddha-TeluguStop.com

బాయ్స్ సినిమా విడుదల అయినా తర్వాత ఎంత పెద్ద ప్రభఞ్జనం సృష్టించిందో మన అందరికి తెలుసు.ఈ సినిమాలో నటించిన వారికి సైతం ఈ చిత్రం వెనక్కి తిరిగి చూసుకోనంత స్టార్డం తెచ్చింది.

ఇక బాయ్స్ సినిమాలో మున్నా పాత్రలో నటించిన సిద్ధార్థ్ ఒక రకం గా ఈ సినిమాకు మెయిన్ లీడ్ అనే చెప్పాలి.

బాయ్స్ సినిమా కన్నా ముందు ఇండస్ట్రీ కి రావాలని తొలుత యాడ్ ఫిలిం మేకర్ అయినా జితేంద్ర దగ్గర, సినిమాటోగ్రాఫర్ అయినా పి సి శ్రీరామ్ దగ్గర అప్పరెంటిస్ గా పని చేసాడు.

వీరిద్దరి సహాయం తో అసిస్టెంట్ దర్శకుడిగా మారి మణిరత్నం దగ్గరికి చేరాడు.ఆ టైం లో మణి రత్నం కన్నతుల్ ముతమిట్టల్ అనే చిత్రానికి పని చేస్తున్నారు.

ఈ సినిమా అమృత అనే పేరుతో దిల్ రాజు తెలుగు లో డబ్ చేసాడు.ఎవరికి తెలియని విషయం ఏంటి అంటే ఈ సినిమాలో మాధవన్ బస్సులో వెళ్లే ఒక సీన్ ఉండగా, అతడి వెనక నిలబడే జూనియర్ ఆర్టిస్ట్ గా తొలిసారి కనిపించాడు.

ఇక ఈ సినిమా కు స్క్రిప్ట్ రైటర్ గా పని చేసిన సుజాత అలియాస్ ఎస్ రంగనాథన్ గారు శంకర్ కి రికమెండ్ చేయడం తో బాయ్స్ సినిమాకు ఆడిషన్ ఇచ్చాడు.

Telugu Amrutha, Shankar, Sidhharth, Siddhart Artist, Siddharth, Yuva-Movie

ఆలా బాయ్స్ సినిమా లో నటించే అవకాశం వచ్చి అక్కడ నుంచి నేటి వరకు అతడి కెరీర్ నిర్విరామంగా కొనసాగుతుంది.ఇక బాయ్స్ సినిమా షూటింగ్ లో గాయపడి మూడు రోజుల పాటు మంచానికే పరిమితం అయ్యాడు.తన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న క్రమంలోనే సిద్ధార్థ్ టాలెంట్ ని గుర్తించాడు మణిరత్నం.

ఆలా శంకర్ తో బాయ్స్ సినిమా షూటింగ్ జరుగుతుండగానే ముగ్గరు హీరోల కథాంశం తో తెరకెక్కిన సినిమా ఆయత ఎజ్హుతు లో సిద్ధార్థ్ కి అవకాశం ఇచ్చాడు.ఈ సినిమా యువ పేరుతో తెలుగు లో డబ్ చేయగా మంచి విజయం సాదించింది.

ఆ తర్వాత తెలుగు లో నువ్వొస్తానంటే నేనడ్డంతన చిత్రం లో నటించి తెలుగు వారికీ సైతం ఒక క్యూట్ హీరో అయిపోయాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube