చివరికి ఫ్యాన్స్ కూడా కాటేస్తారు.. స్టార్ హీరోయిన్ పై సిద్దార్థ్ షాకింగ్ కామెంట్స్!

Actor Siddarth Tweet Goes Viral About Actress Samantha

తెలుగుతో పోలిస్తే తమిళంలో వరుస సినిమాలతో సిద్దార్థ్ బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే.సిద్దార్థ్ ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించడం లేదు.

 Actor Siddarth Tweet Goes Viral About Actress Samantha-TeluguStop.com

అయితే సోషల్ మీడియాలో సిద్దార్థ్ చేసే పోస్టుల గురించి మాత్రం జోరుగా చర్చ జరుగుతుండటం గమనార్హం.తాజాగా సిద్దార్థ్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టగా సమంత గురించే సిద్దార్థ్ ఆ పోస్ట్ పెట్టారని నెటిజన్లు భావిస్తున్నారు.

సోషల్ మీడియాలో సమంత కొందరు నెటిజన్ల నుంచి తాను ప్రేమాభిమానాలను పొందుతున్నానని పేర్కొన్నారు.నెటిజన్లు కూడా తన లైఫ్ లో భాగం అయిపోయారని ఆమె చెప్పుకొచ్చారు.

 Actor Siddarth Tweet Goes Viral About Actress Samantha-చివరికి ఫ్యాన్స్ కూడా కాటేస్తారు.. స్టార్ హీరోయిన్ పై సిద్దార్థ్ షాకింగ్ కామెంట్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే కొందరు మాత్రం తనను తీవ్రస్థాయిలో ట్రోల్ చేస్తున్నారని అసభ్యకర కామెంట్లు చేస్తున్నారని సామ్ చెప్పుకొచ్చారు.తన గురించి అసభ్యకరమైన కామెంట్లు చేస్తున్నారని వారందరినీ నేను కోరేది ఒక్కటేనని సామ్ తెలిపారు.

నేను చేసే ప్రతిదానిని అంగీకరించాలని డిమాండ్ చేయనని సామ్ చెప్పుకొచ్చారు.మీకు నా అభిప్రాయాలు నచ్చని పక్షంలో ఆ అభిప్రాయాలను చెప్పడానికి ఒక విధానం ఉందని సమంత కామెంట్లు చేశారు.

అయితే సిద్దార్థ్ ఈ పోస్ట్ కు కౌంటర్ గా కొంతమంది స్టార్స్ ప్రమాదకరమైన సోషల్ మీడియా ప్రపంచంలో అభిమానుల గ్రూప్స్ ను నిర్వహించడం కోసం, వారిని ఆయుధాలుగా మార్చడం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నారు.

చివరికి అభిమానులు కూడా కాటేస్తారని స్టార్స్ అర్థం చేసుకోవాలని ఏదీ తనంతట తనే జరగదని ఇకనైనా ప్రేమను, ద్వేషాన్ని కొనుక్కోవడం మానాలని సిద్దార్థ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.సమంత పేరు చెప్పకుండా సిద్దార్థ్ చేసిన ట్వీట్ గురించి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది.సిద్దార్థ్ సమంతను కావాలని టార్గెట్ చేస్తున్నాడని కొంతమంది అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

#Siddarth #Samantha #Tweet

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube