వైరల్ అవుతున్న సిద్దార్థ్ పాత వీడియో.. సామ్ కోసం ప్రాణం పోయేలా పాడుతూ?

మన దేశానికి చెందిన ప్రముఖ నటులలో హీరో సిద్దార్థ్ కూడా ఒకరనే సంగతి తెలిసిందే.శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన బాయ్స్ సినిమాతో నటుడిగా కెరీర్ ను మొదలుపెట్టిన సిద్దార్థ్ తొలి సినిమాతోనే సక్సెస్ ను అందుకున్నారు.

 Actor Siddarth Old Video Goes Viral In Social Media Details, Goes Viral, Old Vid-TeluguStop.com

తెలుగులో నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు సినిమాలతో సిద్దార్థ్ ఖాతాలో విజయాలు చేరాయి.ఈ సినిమాలతో సిద్దార్థ్ కు తెలుగులో లవర్ బాయ్ గా గుర్తింపు దక్కింది.

అయితే ఆ తర్వాత సిద్దార్థ్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన బాద్ షా సినిమాలో గెస్ట్ రోల్ లో నటించిన సిద్దార్థ్ ఆ తర్వాత తెలుగు సినిమాల్లో పెద్దగా నటించలేదు.

మహాసముద్రం సినిమాతో తెలుగులోకి రీఎంట్రీ ఇస్తున్న సిద్దార్థ్ ఈ సినిమా రిజల్ట్ ను బట్టి తెలుగులో కెరీర్ ను కొనసాగించాలో వద్దో నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది.

అయితే తాజాగా సిద్దార్థ్ ట్విట్టర్ లో చేసిన ఒకటి నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే.

సిద్దార్థ్ సమంతను ఉద్దేశించి ఆ పోస్ట్ చేశాడని చాలామంది భావిస్తున్నారు.అయితే ఆ తర్వాత కొంతమంది సిద్దార్థ్ ను తీవ్రస్థాయిలో ట్రోల్ చేశారు.అయితే సిద్దార్థ్ ఫ్యాన్స్ కూడా ట్రోల్ చేస్తున్న వాళ్లకు ధీటుగా కౌంటర్ ఇచ్చారు.సామ్ కోసం గతంలో సిద్దార్థ్ పాడిన పాటను తెగ వైరల్ చేస్తున్నారు.సిద్దార్థ్ సమంత కోసం ఆ వీడియోలో అద్భుతంగా పాట పాడారు.

సిద్దార్థ్ ట్వీట్ లో ఏదైనా తప్పుగా అనిపించి ఉంటే ఆ వీడియో చూడాలని సిద్దార్థ్ ఫ్యాన్స్ పోస్ట్ లో పేర్కొన్నారు.ఓ చెలియా నా ప్రియ సఖియా పాట తమిళ వెర్షన్ ను సిద్దార్థ్ పాడటం గమనార్హం.ఈ వీడియోను చూసి సిద్దార్థ్ ను ట్రోల్ చేయాలంటూ అతని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube