ఆ ప్రముఖ నటుడు అరెస్ట్.. ఎవరంటే?

సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన కిక్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన కిక్ శ్యామ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.చెన్నైలోని కోడంబాక్కంలో పోకర్ క్లబ్ నిర్వహిస్తున్న శ్యామ్ గ్యాంబ్లింగ్ కి పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు.అయితే అతనికి ఎటువంటి అనుమతులు లేకపోయినప్పటికీ పేకాట, బెట్టింగులు నిర్వహిస్తుండటంతో కేసు నమోదు చేశారు.

 Actor Kick Shyam. Surender Reddy, Chennai Police, Gambling-TeluguStop.com

2001లో మోడల్ గా కెరీర్ ప్రారంభించి పలు సినిమాల్లో నటించినప్పటికీ 2009 లో విడుదల అయినా కిక్ సినిమా అతడి కెరీర్ ని మలుపు తిప్పింది.తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో నటిస్తూ శామ్ బిజిగా మారాడు.తెలుగులో ఎక్కువ సురేందర్ రెడ్డి సినిమాల్లోనే ప్రత్యేకమైన పాత్రల్లో నటించాడు.కిక్, ఊసరవెల్లి ,రేసుగుర్రం, కిక్- 2 వంటి సినిమాల్లో నటించాడు.

Telugu Kickshyam, Chennai-General-Telugu

కిక్ సినిమాతో అతని కెరీర్ మలుపు తిరగడంతో అప్పటి నుండి అతడి పేరు కూడా కిక్ శ్యామ్ గా మారింది.కాగా శ్యామ్ పూర్తి పేరు మొహమ్మద్ షమ్‌షుద్దీన్ ఇబ్రహీం.పలు సినిమాల్లో మంచి నటనతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు.

ఎక్కువగా పోలీసు పాత్రల్లో కనిపించి అందరిని అలరించాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube