'పుష్ప'రాజ్ కు హిందీలో గాత్రం అందించింది ఈయనే అట!

Actor Shreyas Talpade Lends His Voice To Allu Arjuns Titular Role In The Hindi Version

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా గ్లామర్ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప.భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమాని మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి తెరకెక్కిస్తున్నారు.

 Actor Shreyas Talpade Lends His Voice To Allu Arjuns Titular Role In The Hindi Version-TeluguStop.com

ఇక ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న విడుదల చేయబోతున్న సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్స్ ను కూడా భారీ స్థాయిలో చేస్తున్నారు.

పాన్ ఇండియా స్టార్ గా అల్లు అర్జున్ మొదటిసారి ఎంట్రీ ఇస్తుండడంతో ప్రమోషన్స్ కూడా అదే స్థాయిలో చేయడానికి మేకర్స్ అంత సిద్ధం అయ్యారు.

 Actor Shreyas Talpade Lends His Voice To Allu Arjuns Titular Role In The Hindi Version-పుష్ప’రాజ్ కు హిందీలో గాత్రం అందించింది ఈయనే అట-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అందుకే నార్త్ లో ఈ సినిమాను ప్రేక్షకుకు మరింత చేరువ చేయడానికి బ్యాక్ గ్రౌండ్ పనులు స్టార్ట్ చేసారు.హిందీ మార్కెట్ లో అల్లు అర్జున్ మొదటి సినిమా కావడంతో ఈ సినిమాను వీలైనంత ఎక్కువుగా ప్రోమోట్ చేస్తూ నార్త్ ప్రేక్షకులను ఈ సినిమా కోసం రెడీ చేస్తున్నారు.

ఇక తాజాగా ఈ సినిమా నుండి ట్రైలర్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే.ఇక ఈ ట్రైలర్ లో పుష్పరాజ్ చెప్పిన డైలాగ్స్ కు, రాయలసీమ యాసకు, లుక్స్, అయన స్టైల్ కు మరొకసారి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.

ఇక ఈ సినిమా హిందీ ట్రైలర్ కూడా నిన్న అజయ్ దేవగన్ చేతుల మీదుగా విడుదల చేయగా అక్కడ కూడా మంచి రెస్పాన్స్ లభించింది.

ఇక ఇప్పుడు ఈ ట్రైలర్ లో అల్లు అర్జున్ కు గాత్రం అందించింది ఎవరా అని అందరు చర్చించు కుంటున్నారు.అయితే హిందీలో పుష్పరాజ్ కు డబ్బింగ్ చెప్పింది ఒక బాలీవుడ్ నటుడు అని తెలుస్తుంది.ఈ విషయాన్నీ స్వయంగా డబ్బింగ్ చెప్పిన నటుడే సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

అతడి పేరు శ్రేయాస్ తల్పాడే.ఏవైనా సోషల్ మీడియా ద్వారా ” పుష్ప ది రైజ్ ట్రైలర్ ను షేర్ చేస్తూ.

పుష్ప లో భారతదేశపు అత్యంత పవర్ ఫుల్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి గాత్రదానం చేసినందుకు సంతోషంగానూ.గౌరవంగాను ఉంది అంటూ ట్వీట్ ద్వారా తెలిపాడు.

ఆయన హార్డ్ వర్క్ కు తగినట్టుగా డబ్బింగ్ చెప్పడానికి ప్రయత్నించానని.తెలిపాడు.ఇక అందరు వెతుకుతున్నది ఆయనేనని అధికారికంగా రివీల్ కావడంతో ఈ చర్చలుకు ఇక్కడితో బ్రేక్ పడింది.

#Allu Arjun #Sukumar #Pushpa #Pushpa Trailer #Shreyas Talpade

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube