డబ్బు కోసం ఫ్రెండ్ కుటుంబం నన్ను మోసం చేసింది.. శివారెడ్డి కీలక వ్యాఖ్యలు!

Actor Shivareddy Shocking Comments About His Friend Cheating

నటుడిగా, మిమిక్రీ ఆర్టిస్ట్ గా శివారెడ్డి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అనే సంగతి తెలిసిందే.శివారెడ్డి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రంభ నీకు ఊర్వశి నాకు అనే సినిమా కోసం తాను లుక్ ను మార్చుకున్నానని అప్పటినుంచి అదే లుక్ ను ఫాలో అవుతున్నానని శివారెడ్డి చెప్పుకొచ్చారు.

 Actor Shivareddy Shocking Comments About His Friend Cheating-TeluguStop.com

నాకు ప్రాణ స్నేహితులు ఐదు మంది అని వాళ్లలో తిరుమలాచారి అనే ఒక స్నేహితుడు కరోనా సమయంలో చనిపోయారని శివారెడ్డి తెలిపారు.

స్నేహితుడు గుర్తుకు వస్తే తనకు బాధ కలుగుతోందని శివారెడ్డి పేర్కొన్నారు.

 Actor Shivareddy Shocking Comments About His Friend Cheating-డబ్బు కోసం ఫ్రెండ్ కుటుంబం నన్ను మోసం చేసింది.. శివారెడ్డి కీలక వ్యాఖ్యలు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అవతలి వ్యక్తులకు గౌరవం ఇవ్వడం చాలా ఇష్టమని శివారెడ్డి చెప్పుకొచ్చారు.తన స్నేహితుడు ముందుగా చికిత్స చేయించుకుని ఉంటే బాగుండేదని శివారెడ్డి వెల్లడించారు.హైదరాబాద్ కు వచ్చిన తర్వాత కొంతమంది స్నేహితులు అయ్యారని శివారెడ్డి పేర్కొన్నారు.20 సంవత్సరాల క్రితం తన దగ్గర 70 లక్షల రూపాయలు ఉండేదని శివారెడ్డి చెప్పుకొచ్చారు.

Telugu Comedia, Friend, Memecry Artist, Programmes, Sivaredddy, Tollywood-Movie

ఒక ఫ్రెండ్ ఏ ల్యాండ్ చూసినా వద్దని చెప్పేవాడని తనను డైవర్ట్ చేసేవారని శివారెడ్డి అన్నారు.ఆ తర్వాత తన స్నేహితుడు డబ్బులను తన దగ్గర పెట్టుకుంటానని చెప్పాడని ఆ అమౌంట్ ను స్నేహితుడు, స్నేహితుడి కుటుంబ సభ్యులు వేరే ఖర్చుల కోసం వాడుకున్నారని శివారెడ్డి పేర్కొన్నారు.డబ్బులు అడిగితే ఫ్రెండ్ తడబడ్డాడని ఐదారు రోజులలో ఇస్తానని స్నేహితుడు చెప్పాడని ఇప్పటివరకు ఆ డబ్బులు రాలేదని శివారెడ్డి చెప్పుకొచ్చారు.

డబ్బులు ఉండి ఉంటే మరింత మంచి పొజిషన్ లో ఉండే అవకాశం ఉండేదని శివారెడ్డి పేర్కొన్నారు.మ్యారేజ్ కు ముందు ఈ ఘటన జరిగిందని ప్రోగ్రామ్స్, షూటింగ్స్ వల్ల బిజీగా ఉన్న తాను వాళ్లు మోసం చేస్తారని అనుకోలేదని శివారెడ్డి పేర్కొన్నారు. స్నేహితుడు చేసిన మోసం గురించి శివారెడ్డి చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

#Sivaredddy #Memecry Artist #Friend #Programmes

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube