అన్నం కోసం కూర్చుంటే ఎవరు నువ్వని లేపేశారు.. కన్నీటి కష్టాలు చెప్పుకున్న శివారెడ్డి!

టాలెంట్ ఉన్నా కొంతమంది నటులకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాదనే సంగతి తెలిసిందే.మిమిక్రీ ఆర్టిస్ట్ గా, నటుడిగా పరవాలేదనిపించే స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్న శివారెడ్డి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు ఎదురైన సినిమా కష్టాల గురించి చెప్పుకొచ్చారు.

 Actor Shivareddy Comments About Career Troubles In Early Stage Details, Career-TeluguStop.com

తన జీవితంలో సినిమా కష్టాలు చాలానే ఉన్నాయని శివారెడ్డి పేర్కొన్నారు.ఫైనాన్షియల్ గా స్థిరపడ్డ కుటుంబాల నుంచి ఇండస్ట్రీలోకి వస్తే కొంతవరకు ఎక్కువ సమస్యలు ఉండవని శివారెడ్డి చెప్పుకొచ్చారు.

తిండికి కూడా లోటు ఉంటే మాత్రం ఆ సమయంలో పడే ఇబ్బందులు మామూలుగా ఉండవని శివారెడ్డి పేర్కొన్నారు.తాను ఎవరినైనా కలవడానికి వెళ్లాలంటే లిఫ్ట్ అడిగి వెళ్లేవాడినని బస్ ఎక్కే సమయంలో కండక్టర్ ముందు ఉండే బస్ ను చూసుకునేవాడినని శివారెడ్డి చెప్పుకొచ్చారు.

కొన్నిసార్లు నడుచుకుంటూ వెళ్లేవాడినని శివారెడ్డి పేర్కొన్నారు.ఆ సమయంలో కొంచెం మొహమాటం కూడా ఉండేదని ఆఫీస్ లో ఉంటే ఏమైనా అనుకుంటారని భావించేవాడినని శివారెడ్డి వెల్లడించారు.

మల్కాజ్ గిరిలో షూటింగ్ జరుగుతుండగా భోజనం పెడుతుంటే తాను కూడా కూర్చున్నానని ప్రొడక్షన వ్యక్తి ఎవరు నువ్వు అని అడగగా ఆర్టిస్ట్ గా ట్రై చేస్తున్నానని చెప్పానని ఆ తర్వాత అవతలి వ్యక్తి ఈ సినిమాలో చేస్తున్నావా అని అడిగాడని లేదని చెప్పగా తర్వాత తినమని చెప్పి లేపేశాడని శివారెడ్డి వెల్లడించారు.

Telugu Career Troubles, Malkazgiri, Mimicryartist, Shiva, Shivafaced, Shivafinan

అలాంటి బాధలు, కష్టాలు తాను చూశానని శివారెడ్డి పేర్కొన్నారు.

హనుమకొండలో ఉన్న సమయంలో చాలా ఆకలి వేసిందని తాను హోటల్ కు వెళ్లి అడగగా బ్రెడ్ ఇచ్చారని శివారెడ్డి వెల్లడించారు.జీవితంలో ఎన్నో కన్నీళ్ల, కష్టాల అనుభవాలు ఉన్నాయని శివారెడ్డి తెలిపారు.

దేవుడు కష్టాన్ని అర్థం చేసుకుంటాడని అనుకున్నానని అలాంటి పరిస్థితుల్లో కూడా తను చేతనైనంత సహాయం చేశానని శివారెడ్డి పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube