మరో కుట్రని బయటపెట్టబోతున్న అంటున్న శివాజీ  

మరో నాలుగు రోజులలో రాష్ట్రంలో మరో కుట్ర జరగబోతుంది అంటూ యాక్టర్ శివాజీ సంచలన వాఖ్యలు. .

Actor Shivaji Open Up Once Again-bjp,janasena Modi,open Up Once Again,tdp,ysrcp

ఏపీ రాజకీయాలలో ప్రత్యేక హోదా పోరాట సమితి అంటూ, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం అడ్డుపడుతుందని, అలాగే చంద్రబాబుకూడా అభివృద్ధి అంటూ గ్రాఫిక్స్ చూపించి ప్రజలని మోసం చేస్తున్నారని మొదట్లో విమర్శలు చేసి, తరువాత ఊహించని విధంగా తెలుగు దేశం పార్టీకి అనుకూలంగా మారి, వైసీపీని, కేంద్రంలో మోడీని విమర్శించడం మొదలుపెట్టాడు. ఆపరేషన్ గరుడ అంటూ హడావిడి చేసి, సంచలనంగా మారాడు. ఈపీ కేంద్రంలో బీజేపీ పార్టీ కుట్రలకి తెరతీస్తుంది అంటూ చెప్పుకొచ్చారు..

మరో కుట్రని బయటపెట్టబోతున్న అంటున్న శివాజీ-Actor Shivaji Open Up Once Again

తరువాత చుక్కల భూముల వ్యవహారంలో కూడా కొంత మంది అధికారులు టీడీపీ ప్రభుత్వంకి వ్యతిరేకంగా పని చేస్తున్నారని ఆరోపణలతో మరో సారి తెర ముందుకి వచ్చారు. అలాగే టీడీపీ ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతుందని, ప్రజలు ఎన్నుకున్న పార్టీని దెబ్బ తీసే కుట్రలు జరుగుతున్నాయని చంద్రబాబుకి సపోర్ట్ గా అప్పుడప్పుడు మాట్లాడుతూ తెరపైకి వచ్చేవారు. ఇక ఎన్నికల ముందు నిశ్శబ్దంగా ఉన్న శివాజీ మరో ఐదు రోజులో ఎన్నికలు ఉండగా మరల ఇప్పుడు తెర ముందుకి వచ్చాడు.

తాజాగా మీడియా ముందుకొచ్చిన నటుడు శివాజీ ఇంకో కొత్త కుట్రను బయటపెడతానంటు చెప్పుకొచ్చారు. ఇంకో నాలుగు రోజుల్లో రాష్ట్రంపై కొత్త కుట్ర జరగబోతుందన్న ఆయన రేపు ఆదివారం ఆధారాలతో సహా ఆ కుట్రను బట్టబయలుచేస్తానని స్పష్టం చేశారు. అలాగే రాష్ట్ర చీఫ్ సెక్రెటరీని మార్చడం పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇది ముమ్మాటికీ ప్రధాని మోడీ కుట్రేనని అన్నారు. ఇక రాష్ట్రంపై జరుగుతున్న కుట్రలో ఎవరెవరు భాగంగా ఉన్నారు స్పష్టమైన ఆధారాలు తన దగ్గర ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు.