నటుడు శివాజీ ని అదుపులోకి తీసుకున్న సైబరాబాద్ పోలీసులు

టీవీ 9 షేర్లు కొనుగోలు విషయంలో ఆరోపణలు ఎదురుకొంటున్న నటుడు శివాజీ అరెస్ట్ అయినట్లు తెలుస్తుంది.శంషాబాద్ ఎయిర్ పోర్టు లో శివాజీ ని సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది.

 Actor Shivaji In Police Custody-TeluguStop.com

టీవీ 9 షేర్లు కొనుగోలు,బోగస్ పత్రాలు వంటి పలు ఆరోపణల నేపథ్యంలో నటుడు శివాజీ పై అలానే టీవీ 9 మాజీ సీఈఓ రవి ప్రకాష్ పై అలందా మీడియా పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.దీంతో.

పోలీసులు శివాజీ తో పాటు రవిప్రకాష్ కు కూడా లుకౌట్ నోటీసులు జారీ చేశారు.అయితే రవి ప్రకాష్ విచారణకు హాజరయ్యారు కానీ శివాజీ మాత్రం పలు సార్లు నోటీసులు జారీ చేసినా ఇప్పటివరకు విచారణకు హాజరుకాలేదు.

-Telugu Political News

అయితే బుధవారం ఆయన శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి అమెరికా వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా ఇమ్మిగ్రేషన్ అధికారులు పోలీసులకు సమాచారం అందించడం తో హుటాహుటిన అక్కడకు చేరుకున్న సైబరాబాద్ పోలీసులు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఆయనను అదుపులోకి తీసుకున్నారు.ప్రస్తుతం ఆయనను పీఎస్‌లో విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube