రెండు రోజులు 'ఆమరణ'మైందా?

ప్రస్తుతం చేతిలో సినిమాలు లేని శివాజీ ఓ రాజకీయ నాయకుడిగా వార్తల్లో వ్యక్తి అయ్యారు.భాజపా సభ్యుడైన ఈయన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఆదివారం ప్రారంభించిన రెండు రోజుల నిరాహార దీక్ష ఉన్నట్లుండి ‘ఆమరణ’ నిరాహార దీక్షగా మారిపోయింది.

 Actor Shivaji Fast Unto Death For Ap Special Status-TeluguStop.com

రెండు రోజుల దీక్ష అంటే సోమవారంతో అంటే ఈ రోజుతో ముగిసిపోవాలి.కాని ఇది ఇంకా సా….

గుతుందట.ప్రతి నాయకుడు గొప్పగా ఆమరణ నిరాహార దీక్ష అని చెప్పుకుంటాడు.

కాని ఇప్పటివరకు జరిగిన దాఖలాలు లేవు.ఒక్క పొట్టి శ్రీరాములు మాత్రమే ఆంధ్ర రాష్ర్ట సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు వదిలారు.

ఆ తరువాత ఇప్పటివరకు ఒక్కరు ప్రాణాలు బలిపెట్టిన ఘటన జరగలేదు.శివాజీ చాలాకాలం క్రితమే భాజపాలో చేరాడు.

సినిమా నటులు వివిధ పార్టీల్లో చేరడం సాధారణమే కాబట్టి ఈయన భాజపాలో చేరాడు.ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొన్నాడు.

సినిమాలు లేవు.ఏం చేయాలో తెలియడంలేదు.

కొంతకాలం కిందట ఓల్వో బస్సు కాలిపోయి అనేకమంది ప్రయాణికులు చనిపోయిన ఘటనపై తీవ్రంగా స్పందించాడు.అప్పుడే ప్రజాసమస్యలపై పోరాడే హీరోగా మీడియాలో ఫోకస్‌ అయ్యాడు.

అనేక చర్చా కార్యక్రమాల్లో పాల్గొన్నాడు.పాలకులపై తీవ్ర విమర్శలు గుప్పించాడు.

మళ్లీ ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం దీక్ష ప్రారంభించాడు.భాజపా సభ్యుడై ఉండి దీక్ష చేయడంతో ఆ పార్టీ నాయకులు మండిపడుతున్నారు.

ఆయన్ని పార్టీ నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు.ఒకవేళ శివాజీ మొండిగా దీక్షను కొనసాగిస్తే పోలీసులు ఎత్తి ఆస్పత్రిలో పడేయడం ఖాయం.

ఇలాంటి దీక్షలకు ఇదే ముగింపు.ప్రత్యేక హోదా ఎలాగూ రాదు.

అయినా శివాజీ ఫైట్‌ చేస్తాడా?

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube