రెమ్యునరేషన్ తగ్గించుకున్న శర్వానంద్.. కారణమేమిటంటే..?

స్టార్ హీరోలు, మిడిల్ రేంజ్ హీరోలు హిట్లు వస్తే పారితోషికం పెంచడం, ఫ్లాప్ వస్తే రెమ్యునరేషన్ ను తగ్గించడం ఇండస్ట్రీలో సాధారణంగా జరుగుతుంది.మంచి కథలు ఎంపిక చేసుకుంటున్న హీరోగా పేరు తెచ్చుకున్న శర్వానంద్ ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలేవీ నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టలేదు.

 Hero Sharwanand Decreased His Remuneration For Mahasamudram Movie, One Crore Rup-TeluguStop.com

శర్వానంద్ గత సినిమా శ్రీకారం పాజిటివ్ టాక్ సంపాదించుకున్నా జాతిరత్నాలు సినిమా నుంచి గట్టి పోటీ ఎదురవడంతో నిర్మాతలకు నష్టాలు వచ్చాయి.

ప్రస్తుతం శర్వానంద్ ఆడవాళ్లు మీకు జోహార్లు, మహాసముద్రం సినిమాలలో నటిస్తున్నారు.

మహాసముద్రం మూవీలో శర్వానంద్ తో పాటు హీరో సిద్దార్థ్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమా కొరకు శర్వానంద్ తను సాధారణంగా తీసుకునే రెమ్యునరేషన్ తో పోల్చి చూస్తే తక్కువ మొత్తం రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.

కరోనా దెబ్బకు సినిమా ఇండస్ట్రీకి ఇతర ఇండస్ట్రీలతో పోలిస్తే ఎక్కువగా నష్టాలు వచ్చాయి.

Telugu Crore Rupees, Anu Emmanuel, Siddharth, Lock, Mahasamudram, Sharwanand, To

సినిమాలను నిర్మించాలంటే నిర్మాతలు తీవ్ర భయాందోళనకు గురి కావాల్సిన పరిస్థితులు ఇండస్ట్రీలో ఉన్నాయి.గతంలో మాదిరిగా భారీ రెమ్యునరేషన్లు ఇవ్వడం నిర్మాతలకు తలకు మించిన భారంగా మారింది.ఈ కారణం వల్ల హీరో శర్వానంద్ స్వచ్చందంగా పారితోషికాన్ని తగ్గించుకున్నారని సమాచారం అందుతోంది.

ఆర్.ఎక్స్ 100 సినిమాతో హిట్ సాధించిన అజయ్ భూపతి డైరెక్షన్ లో మహాసముద్రం మూవీ తెరకెక్కుతోంది.

Telugu Crore Rupees, Anu Emmanuel, Siddharth, Lock, Mahasamudram, Sharwanand, To

లాక్ డౌన్ కు ముందు 6 నుంచి 7 కోట్ల రూపాయలకు పైగా పారితోషికం తీసుకున్న శర్వానంద్ కోటి రూపాయలకు పైగా రెమ్యునరేషన్ తగ్గించుకున్నారని తెలుస్తోంది.తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీ ఒకే సమయంలో రిలీజ్ కానుందని సమాచారం.ఈ సినిమాలో అదితిరావ్ హైదిరితో పాటు అను ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు.పారితోషికాన్ని తగ్గించుకున్న శర్వానంద్ సినిమా రిలీజైన తర్వాత లావాదేవీలు చూసుకునే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube