స్థానికేతరులు రాజకీయాలు చేయనవసరం లేదంటూ కమల్,రజనీ లపై మండిపడ్డ నటుడు  

Actor Sathyaraj Honest Comments On Kamal Hassan And Rajani Kanth-

సినిమాలు వేరు రాజకీయాలు వేరు అన్న విషయం తెలిసిందే.సినీ జీవితం పరంగా ఎందరినో అభిమానిస్తూ ఉంటారు.కానీ రాజకీయాలలోకి వచ్చే సరికి తమ అభిమాన నటుడు అయినా కానీ ప్రజలు ఒక పట్టాన ఒప్పుకోలేరు..

Actor Sathyaraj Honest Comments On Kamal Hassan And Rajani Kanth--Actor Sathyaraj Honest Comments On Kamal Hassan And Rajani Kanth-

తమిళ చిత్ర పరిశ్రమలో తలైవా గా పేరున్న రజనీ కాంత్,లోక నాయకుడు కమల్ హాసన్ లు కూడా రాజకీయాలు అనేసరికి విమర్శలకు కేంద్ర బిందువు గానే మారుతున్నారు.తాజాగా వారిపై కట్టప్ప విమర్శలు గుప్పించారు.కట్టప్ప అంటే అదే నండీ నటుడు సత్య రాజ్.

ఆయనే రజనీ కాంత్,కమల్ హాసన్ లను ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు.తమిళనాట రాజకీయ శూన్యత ఉంది అంటూ ఇటీవల రజనీ కాంత్ వ్యాఖ్యానించారు.అయితే ఈ వ్యాఖ్యలపై స్పందించిన సత్య రాజ్ మొన్న జరిగిన ఎన్నికల్లో అలాంటిదేమి లేదని తేలిపోయింది అని,ఒకవేళ ఏదైనా శూన్యత ఉంటె దాన్ని భర్తీ చేయడానికి స్టాలిన్,దయానిధి మారన్ లు లాంటి రాజకీయ నాయకులూ ఉన్నారంటూ వ్యాఖ్యానించారు.

అంతటితో ఆగకుండా స్థానికేతరులు ఇక్కడ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.

వాస్తవానికి రజనీ కాంత్ కేరళ వాసి కాగా,ఎప్పుడో ఆయన కుటుంబం తమిళనాడులోనే సెటిల్ అయిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో స్థానికేతరులు అన్న పదాన్ని సత్య రాజ్ రజనీ విషయంలో వాడినట్లు తెలుస్తుంది.అలానే ఇదే సందర్భంగా కమల్ పై కూడా సత్యరాజ్ పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

కొత్తగా పార్టీ పెట్టిన వారు కూడా విఫలమయ్యారంటూ సత్యరాజ్ వ్యాఖ్యలు చేశారు.ఇటీవల నటుడు కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యాం అన్న పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో కమల్ పార్టీ పెట్టి విఫలమయ్యారు అంటూ సత్యరాజ్ పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు..